న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ సెల్ఫ్ గోల్: బెంగళూరు జట్టుకు కోచ్‌గా ఉన్నాడనే ఎంచుకోలేదా?

BCCI self goal sees Gary Kirsten miss out

హైదరాబాద్: భారత జట్టును 2011 ప్రపంచ కప్ గెలుచుకునేలా చేయడంలో టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ పాత్ర అమోఘం. అనుకోని కారణాల రీత్యా కోచ్ పదవి నుంచి తప్పుకున్న గ్యారీ మరోసారి భారత మహిళల జట్టు కోసం కోచ్‌గా దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్‌గా మరసారి చేసుకున్న ఒప్పందం వల్లనే కిర్‌స్టన్‌ను కాదని రామన్‌ను ఎంపిక చేశారట. ఈ విషయంపై బీసీసీఐ అధికారుల్లో నుంచే అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం.

ప్రపంచ కప్ గెలవడంలో కీలకంగా

ప్రపంచ కప్ గెలవడంలో కీలకంగా

ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం గ్యారీ కిర్‌స్టన్ దరఖాస్తును బీసీసీఐ పక్కనబెట్టడం వివాదాస్పదంగా మారింది. టీమిండియాను టెస్టుల్లో నంబర్ 1గా నిలిపి.. 2011లో ప్రపంచ కప్ గెలవడంలో కీలకంగా వ్యవవహరించారు. అలాంటి కోచ్‌ దరఖాస్తును పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణం చూపుతూ పక్కన పెట్టేసింది బీసీసీఐ. దీనిపై బీసీసీఐ అధికారులే మండిపడుతున్నారు.

'కోహ్లీ ఉద్రేకపూర్వక వైఖరి మంచిదే'

బెంగళూరు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడని తెలిసి కూడా

బెంగళూరు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడని తెలిసి కూడా

బీసీసీఐ కిర్‌స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడని తెలిసి కూడా ఆయన నుంచి దరఖాస్తు స్వీకరించింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన త్రిసభ్య కమిటీకి కిర్‌స్టన్ సీవీని పంపింది. అందుబాటులో ఉన్న వారిలో అత్యుత్తమమైన ముగ్గుర్ని ఎంపిక చేయమంటే.. ప్యానెల్ ముందుగా కిర్‌స్టన్ వైపు మొగ్గు చూపింది.

కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ

కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ

గ్యారీతో పాటుగా డబ్ల్యూవీ రామన్, వెంకటేశ్ ప్రసాద్‌‌లను కూడా ఎంపిక చేశారు. ఆర్సీబీతో గ్యారీకి ఒప్పందం కుదరి ఉండటంతో కాదనుకున్నారట. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలను నిర్దేశించే ముందే బీసీసీఐకి ఈ విషయం గుర్తుకు రాకపోవడం శోచనీయం. ‘మహిళల జట్టుతో కలిసి పని చేసేందుకు కిర్‌స్టన్ సుముఖత వ్యక్తం చేస్తే, మీరు కాదంటారా? టీ20 క్రికెట్ క్లబ్‌‌కు.. అది కూడా పురుషుల జట్టుకు కోచ్‌గా ఉన్నాడని గ్యారీని వదులుకుంటారా? ఇది నిజంగానే జోక్' అంటూ ఓ అధికారి విస్మయం వ్యక్తం చేశారు.

కోచ్‌గా ఎంపిక చేయలేకపోతున్నామని తెలిసి

కోచ్‌గా ఎంపిక చేయలేకపోతున్నామని తెలిసి

కిర్‌స్టన్‌ను కోచ్‌గా ఎంపిక చేయలేకపోతున్నామని తెలిసి త్రిసభ్య ప్యానెల్ సభ్యులు షాకయ్యారట. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ వారిని అద్భుతంగా ఆకట్టుకుందని సమాచారం. కిర్‌స్టన్ 2 నెలల క్రితమే ఆర్సీబీతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆ పదవిని వదులుకోలేని స్థితిలో ఉండడంతో మహిళల జట్టు కోచ్ పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

Story first published: Friday, December 21, 2018, 10:56 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X