'కోహ్లీ ఉద్రేకపూర్వక వైఖరి మంచిదే'


హైదరాబాద్: సిరీస్ కసితో ఎదురుచూస్తున్న జట్లు మైదానంలో హోరాహోరీగా పోరాడుతున్నాయి ఆసీస్-భారత్‌లు. ఇదే నేపథ్యంలో పెర్త్ వేదికగా ఇరు జట్ల కెప్టెన్‌లు ఆవేశంగా కనిపించారు. ఉత్సాహవంతంగా కనిపిస్తూ.. పరస్పర ఉద్రేకాలు చూపించుకునే పరిస్థితి నెలకొంది. అగ్రజట్లలో తొలి స్థానంలో కొనసాగుతున్న భారత్‌ను గెలిపించాలనే కసిలో కోహ్లీ తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే విరాట్‌పై విమర్శలతో పాటు ప్రశంసలు కురుస్తున్నాయి.

కోహ్లీ ‘ఉద్రేకపూర్వక వైఖరి’ మంచిదే
ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ గెలవాలనుకునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘ఉద్రేకపూర్వక వైఖరి' మంచిదేనని ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెమన్ అన్నారు. మైదానంలో అతడి ప్రవర్తన తప్పుగా లేదని పేర్కొన్నారు. పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ, పైన్ మాటల యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్లు కొందరు విరాట్‌ను తప్పుపట్టడంతో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా ఇంతకు ముందే వివరణ ఇచ్చాయి.
పోటీ అనేది బంతికి.. బ్యాట్‌కి మాత్రమే: గంభీర్

క్రీడా స్ఫూర్తితోనే.. ఎవరూ గీత దాటలే
‘విరాట్ కోహ్లీ అభిరుచి గల క్రికెటర్. మైదానంలో అతడి నుంచి బహిర్గతమయ్యేది అదే. అతడిది ఉద్రేక వైఖరి. సవాళ్లు విసిరేవారిని విరాట్ ఆస్వాదిస్తాడు. గెలవాలని తపనపడతాడు. కేవలం అతడి కోసమే కాదు దేశం కోసం విజయం సాధించాలని గాఢంగా కోరుకుంటాడు. పైన్, విరాట్ ఘర్షణ బాగుంది. ఇది క్రీడా స్ఫూర్తితోనే జరిగింది. వీరిద్దరిలో ఎవరూ గీత దాటలేదు. వీరి మాటలు స్టంప్‌మైక్‌ల ద్వారా నవ్వు తెప్పించాయి' అని లెహ్‌మన్ అన్నారు.

టీమిండియా ఓటమికి కారణాలుగా
ఆస్ట్రేలియా ప్రస్తుత కోచ్ జస్టిన్ లాంగర్ సైతం కోహ్లీ గురించి ఇలాగే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని లెహ్‌మన్ పేర్కొన్నారు. రోజురోజుకీ విశ్వాసం పెంచుకుంటున్నాడని వెల్లడించారు. నలుగురు పేసర్లను ఎంచుకోవడం, స్పిన్నర్ లేకపోవడం టీమిండియా ఓటమికి కారణాలుగా విశ్లేషించారు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన అవసరమైనన్ని పరుగులు చేయలేదన్నారు. ఆసీస్ రెండు ఇన్నింగ్సుల్లో బాగా పరుగులు చేసిందన్నారు. కోహ్లీని మినహాయిస్తే చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె పరుగులు చేస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది యాషెస్‌తో పోలిస్తే ఈ సారి బాక్సింగ్‌డే టెస్టు జరిగే మెల్‌బోర్న్ పిచ్ బాగుంటుందని వెల్లడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications