న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ఛైర్మన్ పదవి పోటీపై పెదవి విప్పిన గంగూలీ!

BCCI president Sourav Ganguly Says I am young and in no hurry to become ICC chairman

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఐసీసీ చైర్మన్ పదవి రేసులో బీసీసీఐ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, డేవిడ్ గొవెర్ దాదా నాయకత్వ లక్షణాలను కొనియాడటం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే గంగూలీ మాత్రం ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడానికి తాను ఇంకా చిన్నవాడినని, ఇప్పుడే తొందర లేదని స్పష్టం చేశాడు.

ఇటీవలే ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి భారత్‌కే చెందిన శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో అప్పటివరకు ఆ స్థానంపై కన్నేసిన ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఇప్పుడు ఆ రేసులో వెనుకపడ్డాడు. ఐసీసీ ఛైర్మన్‌ విషయంపై ఇండియాటుడేతో మాట్లాడిన దాదా పలు ఆసక్తిర విషయాలు వెల్లడించాడు.

అది బోర్డు నిర్ణయం..

అది బోర్డు నిర్ణయం..

‘ఐసీసీ ఛైర్మన్‌ పదవి గురించి నాకు తెలియదు. అది బోర్డు సభ్యులందరూ కలిసి తీసుకునే నిర్ణయం. అలాగే ఇప్పుడు ఐసీసీ నిబంధనలు కూడా మారాయి. ఒకవేళ ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలంటే ఆ వ్యక్తి తన దేశం తరఫున బోర్డులోని పదవుల నుంచి తప్పుకోవాలి. ఇంతకుముందులా రెండు పదవులు చేపట్టే అవకాశం లేదు. అది బీసీసీఐ చేసిన మార్పు కాదు, ఐసీసీ చేసిందే. అయితే, ఇప్పుడున్న బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఇక్కడ పదవిలో ఉంటూనే ఐసీసీ లేదా ఏసీసీలో కొనసాగొచ్చు. కానీ, బీసీసీఐలో మాత్రం రెండు పదవులు చేపట్టకూడదు. అలాగే ఐసీసీ నిబంధనల ప్రకారం అక్కడా, ఇక్కడా రెండు పదవులు కలిగి ఉండొద్దు' అని గంగూలీ వివరించాడు.

మధ్యలో వదిలేయడం..

మధ్యలో వదిలేయడం..

చివరగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను బీసీసీఐ నుంచి తప్పుకోవడం కూడా సరికాదని దాదా పేర్కొన్నాడు. 'భారత క్రికెట్‌ బోర్డును ఇలా మధ్యలో వదిలి వెళ్లడం, లేదా వెళ్లాల్సిన పరిస్థితులు రావడం సరైనవో కాదో నాకు తెలియదు. కానీ, ఐసీసీ ఛైర్మన్‌ పదవికి మాత్రం తొందరపడట్లేదు. అందుకు నేనింకా చిన్నవాడిని. అవి ఎంతో గౌరవప్రదమైన పదవులు. జీవితంలో ఒక్కసారే చేసే పనులు. ఇంతకుముందు ఆ పదవుల్లో కొనసాగిన గొప్ప పాలకులంతా ఒక్కొక్కసారే ఆయా బాధ్యతలు చేపట్టారు. క్రీడలకు సంబంధించినంత వరకు ఇతరుల కన్నా నాకు మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసు. ఎందుకంటే నా జీవితమంతా ఆటతోనే ముడిపడి సాగింది. కాబట్టి, ఐసీసీ పదవిని చేపట్టాల్సి వస్తే అది బోర్డు సభ్యులందరి నిర్ణయం ప్రకారమే జరగుతుంది' అని దాదా స్పష్టం చేశాడు.

కరోనా వల్ల గడ్డు పరిస్థితులు..

కరోనా వల్ల గడ్డు పరిస్థితులు..

ఇక దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో భారత క్రికెట్‌కు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని దాదా తెలిపాడు. తాను కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌తో ఎప్పటికప్పుడూ మాట్లాడుతున్నానని తెలిపాడు. వారంత పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళనకు గురువుతున్నారని తెలిపాడు. ఇక విరాట్ నివసిస్తున్న ముంబైలో పరిస్థితి మరి దారుణంగా ఉందన్నాడు. బోర్డులోని ప్రతీ ఒక్కరితో టచ్‌లో ఉంటూ భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తున్నాం. కానీ ఎప్పుడు మొదలు పెడ్తామనే విషయాన్ని మాత్రం చెప్పలేనని దాదా తెలిపాడు.

అఫ్గాన్ ప్రపంచకప్ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటా: రషీద్ ఖాన్

Story first published: Sunday, July 12, 2020, 17:54 [IST]
Other articles published on Jul 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X