Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లైవ్‌లో నోరు జారిన బ్రావో.. అమ్మాయిలతో చిల్ అవుతుంటే ఫోన్ చేశారంటూ..!(వీడియో)

కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మెంటార్, వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో చిక్కుల్లో పడ్డాడు. లైవ్‌లో ఉన్నామనే సోయిలేకుండా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిలను కోడిపిల్లలుగా సంబోదిస్తూ అతను చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు బ్రావోపై మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే..?

ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో శుక్రవారం కేకేఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కెప్టెన్ అజింక్యా రహానే, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్, హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌లతో పాటు మెంటార్ బ్రావో పాల్గొన్నారు. అయితే, ప్రెస్‌మీట్ అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే.. మైకులు ఆన్ చేసి ఉన్నాయనే విషయం గమనించకుండా బ్రావో తన సహచరులతో సరదాగా మాట్లాడాడు.

Watch Dwayne Bravo Sparks Controversy with Two Chicks at Home Remark at KKR Presser

తన పక్కనే ఉన్న షేన్ వాట్సన్‌తో మాట్లాడుతూ.. 'నేను ఇంటి దగ్గర రెండు చిక్స్‌తో(ఇద్దరు అమ్మాయిలతో) ఉన్నప్పుడు వీళ్లు(ప్రెస్ మీట్‌కు రావాలని) నాకు ఫోన్ చేశారు' అని అన్నాడు. బ్రావో నోరు జారడాన్ని గమనించిన రహానే.. మైక్‌లు ఆన్‌లో ఉన్నాయని, లైవ్‌లో ఉన్నామని అతన్ని అప్రమత్తం చేశాడు. 'మైక్స్ ఆన్‌లో ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడు'అని రహానే హెచ్చరించాడు. దాంతో అప్రమత్తమైన బ్రావో.. ఒక్కసారిగా షాక్‌కు గురై తన తప్పును తెలుసుకున్నాడు. ఆ తర్వాత ప్రెస్‌మీట్ అంతా చాలా గంభీరంగా సాగింది.

వీడియోను తొలగించిన కేకేఆర్..

అమ్మాయిలను కోడి పిల్లలతో పోల్చడం, వారితో ఉండగా ఫోన్ చేశారని చెప్పడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం తమ అధికారిక ఖాతాల నుంచి ఆ ప్రెస్‌మీట్ పూర్తి వీడియోను తొలగించింది.

ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళల పట్ల ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు బ్రావోను విమర్శిస్తున్నారు. 'కోల్‌కతా టీమ్ మేనేజ్‌మెంట్ సమక్షంలో బ్రావో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. మైక్ ఆన్‌లో ఉందని రహానే చెప్పగానే బ్రావో ముఖం మారిపోయింది. ఇలాంటి మనస్తత్వంతో అతను ఐపీఎల్ 2026 సీజన్‌లో కొనసాగడం దారుణం.'అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రొఫెషనల్ కెరీర్‌లో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలని మరొకరు చురకలంటించారు.

చర్యలు తీసుకుంటారా..?

గతంలో కరణ్ జోహర్ షోలో హార్దిక్ పాండ్యా ఇలానే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతను క్షమాపణలు చెప్పినా.. బీసీసీఐ అతనిపై చర్యలు తీసుకుంది. బ్రావో మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ అతని ప్రతిష్టను మాత్రం దిగజార్చుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. బ్రావోపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లేదా కేకేఆర్ యాజమాన్యం ఏవైనా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.

Story first published: Saturday, March 21, 2026, 12:15 [IST]
Other articles published on Mar 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+