Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌కు మూడో ర్యాంక్.. టాప్ ఫ్రాంచైజీ లీగ్ ఏంటంటే..?

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్రాంచైజీ లీగ్స్ ర్యాంకింగ్స్‌లో ఆశ్చర్యకరంగా ఐపీఎల్‌కు మూడో స్థానం దక్కింది. వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్(డబ్ల్యూసీఏ) ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్ లీగ్' టాప్‌లో నిలవగా.. సౌతాఫ్రికా వేదికగా జరిగే SA20 రెండో స్థానాన్ని అందుకుంది.

ఐపీఎల్ మూడో స్థానంలో నిలవగా... ఆస్ట్రేలియా ఫ్రాంచైజీ లీగ్ బిగ్ బాష్ నాలుగో స్థానం, పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఐదు, మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ), ఐఎల్‌టీ20, కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్), అబుదాబి టీ10, బీపీఎల్(బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఐపీఎల్‌కు ఏ మాత్రం పోటీ కానీ..

సంపద, ఆదరణ, పాపులారిటీ ఎలా చూసుకున్నా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తిరుగులేదు. క్రికెట్‌లోనే అత్యుత్తమ లీగ్‌ల్లో ఐపీఎల్ ఒకటి. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది అనామక ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. రాత్రికి రాత్రే స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు. అలాంటి ఐపీఎల్‌కు మూడో స్థానం ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐపీఎల్‌లో ఆటగాళ్లు అందుకునే పారితోషికంలో కనీసం ఐదో వంతు కూడా ఉండని ది హండ్రెడ్ లీగ్‌కు అగ్రస్థానం ఇవ్వడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడికి దక్కిన మొత్తం. రూ.4.81 కోట్లు. అదే ఐపీఎల్‌లో అత్యధిక ధర రూ.27 కోట్లు. రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఈ భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.25 కోట్ల కంటే ఎక్కువ పలికిన ఆటగాళ్లు కూడా పలువురు ఉన్నారు.

IPL Ranks 3rd Behind The Hundred and SA20 in WCA Global T20 League Rankings 2026

ర్యాంకులకు ఈ అంశాలు..

అయితే ర్యాంకులను ప్రకటించేందుకు డబ్ల్యూసీఏ కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. వాటిని ప్రకారం 100 పాయింట్లకు ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించింది. ఆటగాళ్లకు జీత భత్యాలు, సెక్యూరిటీ, హక్కులు, వృత్తిపరమైన ప్రమాణాలు.. ఇలాంటివాటిని ఎంచుకొని పాయింట్లను కేటాయించింది. ఆటగాళ్లు, వారి అసోసియేషన్లు, ఏజెంట్ల నుంచి సర్వే ఫీడ్ బ్యాక్ తీసుకొని ర్యాంకులను ప్రకటించింది.

ఐపీఎల్‌ ర్యాంకు ఎందుకు తగ్గిందంటే..?

ఆదాయం, ఆటగాళ్లకు ఇచ్చే మొత్తం, చెల్లింపుల వ్యవహారంలో ఐపీఎల్‌కు తిరుగులేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉన్న ఆర్థిక బలం మరే జట్టుకు లేదని డబ్ల్యూసీఏ స్పష్టం చేసింది. అయితే ఆటగాళ్ల హక్కుల రక్షణకు సంబంధించిన విషయంలో ఐపీఎల్‌ వెనుకంజలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణకు ఫ్రాంచైజీ లీగ్‌ల కృషి మరువలేనిదని డబ్ల్యూసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ మోఫాట్ తెలిపారు. ఇప్పుడీ ర్యాంకుల ఉద్దేశం ఆయా లీగ్‌లను తక్కువ చేయడం కాదని.. మరింత విజయవంతంగా మారేందుకు అవసరమైన సాయం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

డబ్ల్యూసీఏ ప్రకటించిన ర్యాంకులు..

ది హండ్రెడ్-75.2

ఎస్‌ఏ20-68

ఐపీఎల్- 62.6

బిగ్‌బాష్ లీగ్-62.5

పీఎస్‌ఎల్-48.0

మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ)-43.0

ఐఎల్ టీ20-39.1

సీపీఎల్-38.9

అబుదాబి టీ10-30.1

బీపీఎల్-22.6

Story first published: Friday, March 20, 2026, 17:21 [IST]
Other articles published on Mar 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+