న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mayanti Langer వల్ల చిక్కుల్లో పడ్డ బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ!

BCCI president Roger Binny served conflict of interest notice

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నయా ప్రెసిడెంట్ రోజర్ బిన్నీకి కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పరస్పర విరుద్ద ప్రయోజనాల) సెగ తగిలింది. అతని కోడలు మ‌యంతి లాంగ‌ర్ స్టార్ స్పోర్ట్స్‌‌లో పని చేస్తుందని, ఆ సంస్థ భారత క్రికెట్ హోమ్ సీజన్ మీడియా రైట్స్ కలిగి ఉందని, ఇది కాన్‌ఫ్లిక్ట్ నిబంధనలు ఉల్లంఘించడమేనని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ ఆఫిసర్‌కు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో బీసీసీఐ ఎథిక్స్ ఆఫిసర్ వినీత్ శరణ్.. వివరణ ఇవ్వాలంటూ రోజర్ బిన్నీకి నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదుపై డిసెంబర్ 20 లోపు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

బీసీసీఐ నియమ నిబంధనల్లోని 39(2)(బీ)క్లాస్ కింద నీపై ఎథిక్స్ ఆఫిసర్స్‌కు ఫిర్యాదు అందింది. బీసీసీఐ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ రూల్స్‌లో 38(1)(i), రూల్ 38(2) నిబంధనలు అతిక్రమించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై డిసెంబర్ 20లోపు అఫడవిట్‌తో కూడిన రాతపూర్వక వివరణ ఇవ్వాలని మిమ్మల్ని ఆదేశిస్తున్నాం.'అని వినీత్ శరణ్ ఆ నోటీసుల్లో పేర్కొన్నాడు. రోజర్ బిన్ని కుమారుడు స్టువర్ట్ బిన్నీ సతమణీ మయాంతి లాంగర్ స్టార్ స్పోర్ట్స్ హోస్ట్‌‌గా పనిచేస్తోంది. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

2017లో సుప్రీం కోర్టు నియమిత లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)‌లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్ లేదా ఉద్యోగి.. బోర్డుతో అనుబంధంగా ఉన్న ఏ సంస్థల్లోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వామిగా ఉండకూడదనేది నిబంధన.

బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ నుంచి గత మూడేళ్లుగా చాలా మంది భారత మాజీ క్రికెటర్లు విరుద్ధ ప్రయోజనాల అంశం కింద నోటీసులు ఎదుర్కొన్నారు. మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, దిగ్గజ కెప్టెన్ కపిల్‌దేవ్, మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తదితరులు ఆ నోటీసులు ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. వీరిలో కొంత మంది కంపెనీ డైరెక్టర్ల హోదా నుంచి తప్పుకోగా.. మరికొందరు వివరణలతో సరిపెట్టారు. అయితే వీరిలో చాలా మందిపై ఈ సంజీవ్ గుప్తానే ఫిర్యాదు చేయడం గమనార్హం.
తలనొప్పిగా మారిన ఈ పరస్పర విరుద్ద ప్రయోజనాల నిబంధనలను మార్చేందుకు మాజీ ప్రెసిడెంట్ గంగూలీ తీవ్రంగా ప్రయత్నించాడు.

Story first published: Tuesday, November 29, 2022, 20:59 [IST]
Other articles published on Nov 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X