జింబాబ్వేలో నీటి కొరత.. బాత్‌రూమ్‌ల్లో ఎక్కువ సేపు ఉండద్దంటూ టీమిండియాకు బీసీసీఐ ఆదేశాలు!

హరారే: జింబాబ్వేలో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా దేశరాజధాని హరారేలో వారానికి ఒకసారి మాత్రమే తాగు నీరు వస్తుండటంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏడాది ఈ సీజన్‌లో అక్కడ తాగు నీటి కొరత ఏర్పడటం సర్వ సాధారణం. నీటిని శుద్ది చేసే యంత్రాలు పాడవడంతో ఈ సమస్య మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాత్‌రూముల్లో గంటలకు గంటలు ఉంటూ నీటిని వృథా చేయవద్దంటూ కీలక సూచన చేసింది. ఐదు నిమిషాల్లో స్నానం ముగించుకుని రావాలని, నీటిని కాపాడాలని సూచించింది.

జలకాలాటలు వద్దు..

జలకాలాటలు వద్దు..

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. 'అవును. జింబాబ్వేలో నీటి కొరత ఉంది. వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న హరారేలో ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారని తెలుస్తున్నది. దీంతో మేం క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడాలని సూచించాం. తక్కువ సమయంలోనే స్నానాలను పూర్తి చేసుకోవాలని క్రికెటర్లకు చెప్పాం. నీటి కొరత కారణంగా స్విమ్మింగ్ పూల్స్‌లో జలకాటలు వంటివి అన్ని రద్దు చేశాం..'అని తెలిపాడు .

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

టీమిండియాకు విదేశీ పర్యటనల్లో ఇలా నీటి కొరత ఎదురవ్వడం ఇదే ప్రథమం కాదు. గతంలో 2018లో భారత జట్టు సౌతాఫ్రికాకు వెళ్లినప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తింది. కానీ అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్ల అవసరాలను తీర్చారు. అయితే ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. తాము ప్రజల నీటి కొరతను చూశామని, సర్దుబాటు అలవాటు చేసుకుంటున్నామని చెప్పాడు.

అడ్జస్ట్ అవుతున్నాం..

అడ్జస్ట్ అవుతున్నాం..

ఇదే విషయమై జట్టులో సభ్యుడిగా ఉన్న ఓ క్రికెటర్ స్పందిస్తూ.. 'గతంలో భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు అక్కడ నీటి కొరత ఉందని వినడమే తప్ప నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఇప్పుడది వాస్తవం. నేను కళ్లారా చూస్తున్నా. దీంతో మేం తక్కువ నీటినే వాడుతున్నాం. ఇక్కడ పిచ్ లు కూడా డ్రైగా ఉన్నాయి. వాటికి పట్టడానికి కూడా నీళ్లు లేవు. మేం ఇక్కడ సర్దుబాటు అలవాటు చేసుకున్నాం.' అని తెలిపాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 16, 2022, 13:40 [IST]
Other articles published on Aug 16, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X