న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: పాపం సంజూ.. ఈ జట్టుతో మనం గెలిచినట్లే.. బీసీసీఐపై పేలుతున్న సెటైర్లు!

 BCCI Gets Trolled For Not Selecting Sanju Samson Into For T20 World Cup

హైదరాబాద్: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆసియాకప్ 2022లో టోర్నీలో బరిలోకి దిగిన జట్టులో కేవలం మూడు మార్పులు మాత్రమే చేసింది. గాయాలతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ జట్టులోకి రాగా.. ఆవేశ్ ఖాన్‌పై వేటు పడింది. యువ స్పిన్నర్ రవి బిష్ణయో‌ని స్టాండ్ బై జాబితాలో చేర్చింది. బ్యాటింగ్‌లో ఏ మాత్రం మార్పులు చేయని సెలెక్టర్లు.. మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్‌లను స్టాండ్ బై ప్లేయర్‌గా తీసుకుంది. గాయంతో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది. దారుణంగా విఫలమైన పంత్‌కు మరో అవకాశం ఇచ్చింది. అయితే ఈ జట్టుపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాపం సంజూ శాంసన్..

కొందరు ఈ జట్టు బాగుందని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్ర ఘాటు వ్యాఖ్యలతో సెలెక్టర్లను తప్పుబడుతున్నారు. సంజూ శాంసన్‌కు మరోసారి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో ఉన్న రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ కంటే సంజూ శాంసన్‌కు టీ20ల్లో ఘనమైన రికార్డు ఉందని, అతన్ని ఎందుకు పక్కనపెడుతున్నారని నిలదీస్తున్నారు. అతనికి ఇచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకున్నాడని, విండీస్ పర్యటనలో రాణించడని గుర్తు చేస్తున్నారు. పదే పదే విఫలమవుతున్న రిషభ్ పంత్‌కు వరుసగా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కేవలం లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే పంత్ కొనసాగించడం ఏ మాత్రం సమంజసం కాదంటున్నారు.

దీపక్ చాహర్ లేకుండానా?

ఇక ఆస్ట్రేలియా పిచ్‌‌లను ఏ మాత్రం పట్టించుకోకుండా భారత జట్టును ఎంపిక చేశారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బౌన్సీ, పేస్ పిచ్‌లపై వేగంగా వేసే మహమ్మద్ షమీతో పాటు దీపక్ చాహర్‌లను తీసుకోవాల్సిందని, కానీ స్లోగా బౌలింగ్ చేసే భువనేశ్వర్ కుమార్‌ను తీసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఆసీస్ గడ్డపై దీపక్ చాహర్ ఎంత అవసరమవుతాడనే విషయాన్ని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు చెప్పినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతిగా బౌన్స్ ఉంటే ఆసీస్ వికెట్లపై దీపక్ చాహర్ పవర్ ప్లేలో సత్తా చాటగలడని గవాస్కర్ సూచించాడు.

9వసారి స్టాండ్ బై..

దీపక్ చాహర్ తలరాతనో.. లేక అతని దురదృష్టమో తెలియదు కానీ వరుసగా 9వ సారి అతని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఆసియాకప్ 2022 టోర్నీకి సైతం స్టాండ్ బైగానే ఎంపికైన దీపక్ చాహర్.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన దీపక్ చాహర్ రాకతో లోయరార్డర్ బ్యాటింగ్ బలంగా మారుతుందని భావించారు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ మరోసారి అతన్ని స్టాండ్‌బై ప్లేయర్‌గానే ఎంపిక చేసింది. అత్యంత వేగంగా బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్‌ను సైతం ఈ జట్టులోకి తీసుకోవాల్సిందని హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు సూచించారు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అతని పేరే ఎత్తలేదు.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్

స్టాండ్ బై ప్లేయర్స్: మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్

Story first published: Monday, September 12, 2022, 18:42 [IST]
Other articles published on Sep 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X