న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెచ్‌సీఏపై కన్నెర్ర చేసిన రెవెన్యూ శాఖ

BCCI to appoint observer to tame HCA

హైదరాబాద్: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)పై రెవెన్యూ శాఖ కన్నెర్ర చేసింది. హెచ్‌సీఏకు క్రీడాభివృద్ధి కంటే లాభాపేక్ష ఎక్కువైందని ఆక్షేపించింది. ఈ క్రమంలో లీజు అగ్రిమెంట్‌ (ఒప్పందం)కు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదంటూ హెచ్‌సీఏకు మేడ్చల్‌ జిల్లా కీసర ఆర్డీవో వి.లచ్చిరెడ్డి బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. నోటీసు పత్రాలను ఉప్పల్‌ తహసీల్దార్‌ రమేశ్ కుమార్ హెచ్‌సీఏ సీఈఓ డాక్టర్‌ సి.పాండురంగమూర్తికి అందజేశారు.

స్టేడియం మొత్తాన్ని వ్యాపారమయంగా

స్టేడియం మొత్తాన్ని వ్యాపారమయంగా

2004లో ఉప్పల్‌ రెవెన్యూ మండలంలోని సర్వేనెంబర్‌ 1లోని 23.27ఎకరాల భూమిని జీవో నెం. 701 ద్వారా 25 సంవత్సరాలకు హెచ్‌సీఏకి లీజుకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఏటా రూ. లక్ష లీజు కింద చెల్లించాలి. అయితే లీజు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. స్టేడియం మొత్తాన్ని వ్యాపారమయంగా మార్చి వేసిందని నోటీసులో పేర్కొన్నారు.

ఇటీవల స్టేడియంలో జరుగుతున్న కార్యకలాపాలపై ఒక

ఇటీవల స్టేడియంలో జరుగుతున్న కార్యకలాపాలపై ఒక

కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిపినట్టు ఆర్డీవో వెల్లడించారు. ఈ విచారణలో ఎన్నో ఉల్లంఘనలు గుర్తించినట్టు తెలిపారు. స్టేడియంలో సీసీఎల్‌ వంటి వాణిజ్యపరమైన క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తూ పూర్తిగా ప్రైవేట్‌ సంస్థలకే పెద్దపీట వేస్తున్నట్టు విచారణలో నిర్దారించారని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో అధిక ధరలకు

ఆన్‌లైన్‌లో అధిక ధరలకు

ఐపీఎల్‌ కోసం హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ జట్టుకు స్టేడియాన్ని లీజుకు ఇచ్చి, దాన్ని వాణిజ్య ప్రయోజనాలకు వాడుకునేందుకు అనుమతించిదన్నారు. అలాగే ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న విషయం విచారణలో గుర్తించినట్టు నోటీసులో పేర్కొన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలో అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్నారన్నారు.

లీజు డబ్బులు కూడా చెల్లించడంలేదని

లీజు డబ్బులు కూడా చెల్లించడంలేదని

మైదానాన్ని ప్రైవేటు కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడం లీజు అగ్రిమెంట్‌కు విరుద్దమని పేర్కొన్నారు. లీజు డబ్బులు కూడా చెల్లించడంలేదని పేర్కొన్నారు. నియమ నిబంధనలు పాటించనందున హెచ్‌సీఏకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్టు ఆర్డీవో తెలిపారు. నోటీసుకు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించారు. హెచ్‌సీఏ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని పక్షంలో ల్యాండ్‌ రెవెన్యూ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో ఆర్డీవో హెచ్చరించారు.

Story first published: Thursday, April 26, 2018, 11:57 [IST]
Other articles published on Apr 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X