న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

BBL 2023 ఛాంపియన్ పెర్త్ స్కార్చర్స్.. ఐదో టైటిల్‌తో హిస్టరీ! (వీడియో)

BBL 2023: Perth Scorchers become most successful side in Big Bash after Turners beat Brisbane Heat

పెర్త్: బిగ్ బాష్‌ లీగ్(బీబీఎల్) 2023 సీజన్ టైటిల్‌ను పెర్త్ స్కార్చర్ సొంతం చేసుకుంది. బ్రిస్బేన్ హీట్ టీమ్‌తో శనివారం పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన పెర్త్ స్కార్చర్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదో టైటిల్‌ను ముద్దాడిన పెర్త్ స్కార్చర్.. బీబీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్ కెప్టెన్ అష్టన్ టర్నర్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో విజయానికి బాటలు వేయగా.. కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

175 పరుగులే చేసిన బ్రిస్బేన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీనీ(37 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 41), సామ్ హీజ్‌లెట్(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 34) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పెర్త్ బౌలర్లలో జాసన్ బెహెండ్రాఫ్, మాథ్యూ కెల్లీ రెండు వికెట్లు తీయగా.. డేవిడ్ పేన్, ఆరోన్ హార్డీ, ఆండ్రూ టై తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన పెర్త్ స్కార్చర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

గెలిపించిన కూపర్ కొన్నోలీ..

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్.. ఆదిలోనే ఓపెనర్లు స్టీఫెన్(21), కామెరూన్ బెన్‌క్రాఫ్ట్(15) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఆరోన్ హర్డీ(17) కూడా విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి జోష్ ఇంగ్లీస్(26), కెప్టెన్ అష్టన్ టర్నర్ జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఐదో వికెట్‌గా అష్టన్ టర్నర్ వెనుదిరగడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. పెర్త్ స్కార్చర్స్ విజయానికి 19 బంతుల్లో 41 పరుగులు అవసరమవ్వగా.. కూపర్ కొన్నోలీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆసాధారణ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో పెర్త్ స్కోర్చర్స్ ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

భారత్‌లో సంబరాలు..

ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. హోటల్ రూమ్‌లో ఈ మ్యాచ్‌ను వీక్షించారు. పెర్త్ స్కార్చర్స్ విజయాన్ని ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లు ఆస్వాదించగా.. ఓడిన టీమ్ బ్రిస్బేన్ హీట్స్ ఆటగాళ్లు మాత్రం నిరాశకు గురయ్యాడు. హోటల్ గదిలో డ్యాన్స్ చేసిన విజేత ఆటగాళ్లను ఓడిన ప్లేయర్లు అభినందించారు. ఈ వీడియోను 7 క్రికెట్ అభిమానులతో పంచుకోగా వైరల్ అయ్యింది.

Story first published: Saturday, February 4, 2023, 18:39 [IST]
Other articles published on Feb 4, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X