న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs DC: బర్త్ డే రోజు బాదేసిన వార్నర్!! తల్లి సలహానే పాటించి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా..!!

Australian cricketer David Warner turns 34, Fans wish him Happy Birthday

హైదరాబాద్: డేవిడ్ వార్నర్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేడు. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ అయిన వార్నర్ మైదానంలోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా అతడి బ్యాటింగ్ శైలి ఒకేలా ఉంటుంది. మొదటి బంతి నుంచే ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తుంటాడు. ఇక ప్రత్యర్థి ఎవరైనా, ఎంతటి మేటి బౌలర్ ముందున్నా.. వార్నర్‌కు తెలిసింది మాత్రమే ఒక్కటే!! అదే విరుచుకుపడడం. తన భీకర బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.

డేవిడ్ వార్నర్ పుట్టిన రోజు అక్టోబర్ 27 (మంగళవారం). ఈ సందర్భంగా సహచర క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు. తన పుట్టిన రోజు చెలరేగిన వార్నర్ (34 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు అదిరిపోయే విజయం అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 88 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

 పవర్ ప్లే‌లో హాఫ్ సెంచరీ

పవర్ ప్లే‌లో హాఫ్ సెంచరీ

తన పుట్టిన రోజైన మంగళవారం డేవిడ్ వార్నర్‌ చెలరేగిపోయాడు. ఆర్ అశ్విన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌లెగ్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌తో అతని జోరు మొదలైంది. తర్వాత అన్రిచ్ నోర్జే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్‌.. కాగిసో రబడ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా 22 పరుగులు (4, 4, 0, 6, 4, 4) చేశాడు.

దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్‌ స్కోరు 77 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఏ జట్టుకైనా పవర్‌ప్లేలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్, 2020 సీజన్‌లో ఆరు ఓవర్లకు ముందే ఈ మైలురాయిని చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 52 బంతుల్లోనే సన్‌రైజర్స్‌ 100 పరుగులు నమోదు చేసింది. అయితే కొద్ది సేపటికే అశ్విన్‌ ఓవర్లో ఫోర్‌ కొట్టిన అనంతరం తర్వాతి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వార్నర్‌ వెనుదిరిగాడు.

మూడు ఫార్మాట్‌లలో కలిపి 43 సెంచరీలు:

మూడు ఫార్మాట్‌లలో కలిపి 43 సెంచరీలు:

2009, జనవరి 11న డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. 2009, జనవరి 18న వన్డేల్లోకి వచ్చాడు. న్యూజీలాండ్ జట్టుపైనే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత 2011, డిసెంబర్ 1న ఆసీస్ టెస్ట్ జట్టులో ఆరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి వెనుదిరికి చూసుకోలేదు. మద్యలో ఓ సంవత్సరం నిషేదానికి గురైనా.. అంతేవేగంగా పుంజుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వార్నర్ ఇప్పటివరకు 84 టెస్టుల్లో, 126 వన్డేల్లో, 81 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 7244, వన్డేల్లో 5303, టీ20ల్లో 2265 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 43 సెంచరీలు బాదాడు.

పేపర్ డెలివరీ బాయ్‌గా:

పేపర్ డెలివరీ బాయ్‌గా:

చిన్నతనంలో పేదరికంలో పెరిగిన డేవిడ్ వార్నర్.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. వార్నర్ పదేళ్ల వయసులో బ్యాట్ కొనుగోలు చేయడానికి సైతం అతడి తల్లిదండ్రుల దగ్గర సరిపడా డబ్బులు ఉండేవి కావు. వార్నర్‌కు మామూలు బ్యాట్ కొనిచ్చిన అతడి తండ్రి.. ఈ బ్యాట్‌ను సొంత బిడ్డలా చూసుకోమ్మని చెప్పాడట. ఇక కొద్దిగా పెద్దవాడయ్యాక రాత్రి 3 గంటల వరకు పని చేసి.. ఉదయాన్నే 7 గంటలకు స్కూల్‌కు వెళ్లేవాడు. వారాంతాల్లో పేపర్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ.. స్కూల్ క్యాంప్‌లు, ఈస్టర్ షో ట్రిప్‌లకు వెళ్లడానికి డబ్బు సంపాదించేవాడు. అలా చదువు, క్రికెట్ కొనసాగించేవాడు.

తల్లి సలహానే పాటించి:

తల్లి సలహానే పాటించి:

13 ఏళ్ల వయసులో డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పదేపదే బంతిని గాల్లోకి లేపేవాడు. దీంతో కోచ్ అతణ్ని కుడి చేతి వాటానికి మారమని ఒత్తిడి చేశాడు. కానీ వార్నర్ తల్లి మాత్రం లెఫ్ట్ హ్యాండర్‌గానే కొనసాగమని సలహా ఇచ్చింది. తల్లి సలహానే పాటించిన వార్నర్.. 1877 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ:

భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ:

నిజం చెప్పాలంటే.. డేవిడ్ వార్నర్‌కు ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్.. అద్భుత ఆటతీరుతో భారత అభిమానుల మనసు దోచుకున్నాడు. అంతేకాదు మన తెలుగు జట్టుకు కప్ కూడా అందించాడు. ఇక కరోనా పుణ్యమాని వచ్చిన ఖాళీ సమయాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. వరుస పెట్టి తెలుగు హీరోల టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. మరింత స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్నాడు. పాటలకు స్టెప్పులేస్తూ.. సినీ అభిమానులకు సైతం వార్నర్ దగ్గరయ్యాడు. హ్యాపీ బర్త్ డే వార్నర్!!.

అబిమానులకు షాక్.. లీగ్‌ నుంచి వైదొలిగిన ఏబీ డివిలియర్స్!!

Story first published: Wednesday, October 28, 2020, 7:30 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X