న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అబిమానులకు షాక్.. లీగ్‌ నుంచి వైదొలిగిన ఏబీ డివిలియర్స్!!

AB de Villiers ruled out of BBL 10

దుబాయ్: క్రికెట్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్ బాష్ 10వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. తనని భార్య త్వరలో మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. డెలివరీ సమయంలో ఆమె పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న డివిలియర్స్.. రాబోయే బీబీఎల్ ఎడిషన్ నుంచి ఉన్నపళంగా తప్పుకున్నారు. బీబీఎల్‌లో డివిలియర్స్ బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ బ్రిస్బేన్ జట్టుతో ఒప్పదం కుదుర్చుకున్నాడు. బీబీఎల్ డిసెంబర్ 3న ప్రారంభం అయి ఫిబ్రవరి 6న ముగుస్తుంది.

'అతి త్వరలో మూడోసారి నేను తండ్రిని కోబోతున్నా. డెలివరీ సమయంలో నా భార్య పక్కనే ఉండాలని నిర్ణయించున్నా. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. కరోనా కారణంగా ఎక్కువగా ప్రయాణాలు చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే బిగ్ బాష్ 10వ సీజన్ నుంచి తప్పుకుంటున్నా. గత సీజన్లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ఆడడం బాగుంది. మళ్లీ ఆ క్లబ్‌కి తిరిగి వెళ్తాను' అని ఏబీ డివిలియర్స్ ఓ ప్రకటనలో తెలిపాడు. ఏబీ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020లో ఆడుతున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 36 ఏళ్ల ఏబీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మరోవైపు శ్రీలంక ప్రీమియర్‌ లీగ్ ‌(ఎస్‌ఎల్‌పీఎల్‌) టీ20 టోర్నమెంట్‌ ఈ ఏడాది నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 13 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే లీగ్‌ ఆరంభానికి ముందే పలు ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు విదేశీ స్టార్‌ ప్లేయర్లు ఆ లీగ్‌ నుంచి తప్పుకున్నారు. ఫాఫ్ డుప్లెసిస్‌, ఆండ్రీ రస్సెల్‌, డేవిడ్‌ మిల్లర్, డేవిడ్‌ మలన్‌ వైదొలిగారు.

ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కారణంగా డేవిడ్ మిల్లర్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, డేవిడ్‌ మలన్‌ అందుబాటులో ఉండటం లేదు. ఇక వెస్టిండీస్‌ హార్డ్‌హిట్టర్‌ ఆండ్రీ రసెల్ మోకాలి గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం వీరంతా ఐపీఎల్‌ 2020లో ఆడుతున్న విషయం తెలిసిందే. భారత వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మన్విందర్‌ బిస్లా కూడా ఎల్‌పీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను దక్కించుకున్న వారంలోపే వైదొలగడం విశేషం.

నాన్న కోరిక.. అందుకే చివరివరకూ క్రీజ్‌లో ఉన్నా: మన్‌దీప్ భావోద్వేగంనాన్న కోరిక.. అందుకే చివరివరకూ క్రీజ్‌లో ఉన్నా: మన్‌దీప్ భావోద్వేగం

Story first published: Tuesday, October 27, 2020, 15:40 [IST]
Other articles published on Oct 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X