న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ మాజీ పేసర్ మిచెల్‌ జాన్సన్‌కు అరుదైన గౌరవం!!

Mitchell Johnson Becomes MCC Honourary Life Member || Oneindia Telugu
Australia pacer Mitchell Johnson becomes MCC Honourary Life Member

లండన్‌: ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌కు అరుదైన గౌరవం లభించింది. జాన్సన్‌ను గౌరవ జీవితకాల సభ్యుడిగా ఎన్నుకున్నట్టు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తెలిపింది. లార్డ్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ యాషెస్ టెస్ట్ సందర్భంగా ఎంసీసీ ఆదివారం ఈ ప్రకటన చేసింది. 73 టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన జాన్సన్‌ 28.40 సగటుతో 313 వికెట్లు తీసాడు.

<strong>టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసు ముందు వరసలో లాల్‌చంద్ రాజ్‌పుత్</strong>టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసు ముందు వరసలో లాల్‌చంద్ రాజ్‌పుత్

గాల్లో ఎగురుతున్నా:

గాల్లో ఎగురుతున్నా:

ఈ సందర్భంగా మిచెల్‌ జాన్సన్‌ మాట్లాడుతూ... 'ఇది నాకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది. నేను గౌరవ జీవితకాల సభ్యునిగా ఇక్కడ కూర్చుంటానని అనుకోలేదు. నిజంగా గాల్లో ఎగురుతున్నా. ఎంసీసీ నన్ను ఈ విధంగా గుర్తించబడటం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఈ స్థితిలో ఉండటం నాకు చాలా గౌరవంగా, గర్వంగా ఉంది' అని జాన్సన్‌ తెలిపాడు.

వారు క్రికెట్‌ లవర్సే కాదు:

వారు క్రికెట్‌ లవర్సే కాదు:

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. యాషెస్‌ తొలి టెస్ట్ నుండే ఇంగ్లండ్‌ అభిమానులు స్మిత్‌పై చీటర్‌-చీటర్‌ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై మిచెల్‌ జాన్సన్‌ స్పందించాడు. 'అభిమానులు ఏం అంటున్నారో నేను పట్టించుకోను. అవును స్మిత్ తప్పు చేసాడు. అందుకు శిక్ష కూడా అనుభవించాడు. ఎప్పుడో జరిగిన ఘటనను మళ్లీ మళ్లీ గుర్తు చేయడం ఎంతవరకు న్యాయం. గేమ్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి కొంతమంది ఉంటారు. వారే స్మిత్‌ను ఎగతాళి చేస్తున్నారు. ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారు నా దృష్టిలో క్రికెట్‌ లవర్సే కాదు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన అందరి అభిమానులను ఉద్దేశించి ఇలా అనడం లేదు. మైక్రోఫోన్ ద్వారా ఎగతాళికి సంబందించిన మాటలు వినిపించాయి. ఆ సమయంలో తీవ్ర నిరాశకు గురయ్యా' అని జాన్సన్‌ తెలిపారు.

పీసీబీకి క్షమాపణలు చెప్పిన స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెటర్‌

ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం:

ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం:

మిచెల్‌ జాన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కొన్ని దేశవాళి టీ20 లీగ్‌ల్లో ఆడాడు. గత సంవత్సరం టీ20 లీగ్‌ల్లో సైతం ఆడనని పూర్తి స్థాయిలో క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. కెరీర్‌లో 73 టెస్టుల్లో 313, వన్డేల్లో 153 మ్యాచుల్లో 239, టీ20ల్లో 38 వికెట్లను జాన్స‌న్ పడగొట్టాడు. ఆసీస్ త‌ర‌ఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాన్సన్‌ 2015లో త‌న చివ‌రి టెస్టు, వ‌న్డేను ఆడాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, August 20, 2019, 14:30 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X