న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీసీబీకి క్షమాపణలు చెప్పిన స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెటర్‌

spot-fixing in PSL: Banned Pakistan Cricketer Sharjeel Khan requests for forgiveness

లాహోర్‌: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ ఆటగాడు షార్జీల్‌ ఖాన్‌ తిరిగి తన కెరీర్‌ను కొనసాగించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు, అభిమానులు మరియు సహచరులకు క్షమాపణలు చెప్పాడు. సోమవారం పీసీబీ అవినీతి నిరోధక శాఖ అధికారులను షార్జీల్‌ ఖాన్ కలిసి విజ్ఞప్తి చేశాడు. పీసీబీ విధించిన నిషేధం గడువు ముగియడంతో.. షార్జీల్‌ ఖాన్‌ తిరిగి కెరీర్‌ను కొనసాగించేందుకు అనుమతి లభించింది.

టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసు ముందు వరసలో లాల్‌చంద్ రాజ్‌పుత్

'నా బాధ్యతా రహితమైన ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ పీసీబీ, సహచరులు, అభిమానులు, కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. అందరూ నన్ను క్షమించమని అభ్యర్థిస్తున్నా. ఇక నుంచి బాధ్యతాయుతంగా ఉండి భవిష్యత్‌లో మంచి ప్రదర్శన చేస్తానని హమీ ఇస్తున్నా' అంటూ పీసీబీ విడుదల చేసిన లేఖలో షార్జీల్‌ పేర్కొన్నాడు.

షార్జీల్‌ ఖాన్‌కు విధించిన నిషేధం రెండున్నరేళ్ల గడువు పూర్తయింది. దీంతో అతడు తిరిగి రిహాబిలిటేషన్‌ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాడని, ఈ ఏడాది పూర్తయ్యేలోపు షార్జీల్‌ తన శిక్షణను పూర్తి చేసుకుంటాడని పాక్‌ బోర్డు పేర్కొంది. అనంతరం పాక్ జాతీయ జట్టులో చేరతాడని తెలిపింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షార్జీల్‌ ఒక టెస్టు, 25 వన్డేలు, 15 టీ20లు ఆడాడు.

యాషెస్‌ మూడో టెస్టుకూ అండర్సన్‌ దూరం.. మొయిన్‌ అలీకి నిరాశే!!

2017లో దుబాయ్‌లో నిర్వహించిన పీఎస్‌ఎల్‌ రెండో సీజన్‌లో షార్జీల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో అతడిపై పాక్ బోర్డు ఐదేళ్ల నిషేధం విధించింది. అనంతరం నిషేధాన్ని రెండున్నరేళ్లకు కుదించింది. తాజాగా ఆ గడువు పూర్తవడంతో తిరిగి క్రికెట్ కెరీర్‌ కొనసాగించడానికి అవకాశం ఇచ్చింది.

Story first published: Tuesday, August 20, 2019, 13:51 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X