న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sydney Test: టెస్టు క్రికెట్‌లో తొలిసారి విధులు.. అప్పుడే వార్నర్‌కు వార్నింగ్ ఇచ్చిన మహిళా అంపైర్!!

Australia Female Umpire Claire Polosak warns David Warner before Sydney Test

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన మూడో టెస్టులో ఓ మహిళా అంపైర్ విధులు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిర్ పోలోజాక్ ఫోర్త్ అంపైర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 32 ఏళ్ల పోలోజాక్‌.. పురుషుల టెస్ట్‌కు మ్యాచ్‌ అఫీషియల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో పురుషుల టెస్టు మ్యాచ్‌కి ఓ మహిళ అంపైర్‌గా ఉండటం ఇదే తొలిసారి. పోలోజాక్ ఐసీసీ ఫ్యానల్ అంపైర్‌గానూ ఉన్నారు. క్లెయిర్‌ గతంలో వన్డే మ్యాచ్‌కీ అన్‌ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

వార్నర్‌కు వార్నింగ్

వార్నర్‌కు వార్నింగ్

క్లెయిర్ పోలోజాక్ సిడ్నీ టెస్టుకి ముందే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు వార్నింగ్ ఇచ్చారు. టెస్టు ఆరంభానికి ముందే వార్నర్ పిచ్‌పైకి వెళ్లడంతో.. ఎవరూ ఊహించని రీతిలో వార్నర్‌కు పోలోజాక్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్‌ నుంచి దూరంగా వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. టీమ్ కెప్టెన్, కోచ్‌కి మాత్రమే మ్యాచ్‌కి ముందు పిచ్‌పైకి వెళ్లి పరిశీలించే అధికారం ఉంటుంది. పిచ్‌పైకి కెప్టెన్, కోచ్‌ కాకుండా వార్నర్‌ వెళ్లడంతో పోలోజాక్ సాహసోపేతంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా కూడా రికార్డు

ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా కూడా రికార్డు

మ్యాచ్‌లో ఫోర్త్ అంపైర్ విధులు చాలా పరిమితంగా ఉంటాయి. మ్యాచ్ మధ్యలో బంతుల్ని మార్చడం, మ్యాచ్ కోసం పిచ్‌ని సిద్ధం చేయడం, సబ్‌స్టిట్యూట్‌ని అనుమతించడం, ఆన్ ఫీల్డ్ అంపైర్లకి సాయపడటం లాంటివి ఫోర్త్ అంపైర్ ప్రధాన విధులు. ఈ క్రమంలోనే క్లెయిర్ పోలోజాక్ తన విధులు సక్రమంగా నిర్వర్తించారు. ఐసీసీ రూల్స్ ప్రకారం సిడ్నీ టెస్టుకి ఫోర్త్ అంపైర్‌గా ఐసీసీ ఫ్యానల్ నుంచి ఎవరినైనా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నియమించుకోవచ్చు. ఆ అవకాశాన్ని పోలోజాక్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా ఇచ్చింది. 2019లో ఒమాన్, నమీబియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌కి పోలోజాక్ ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా కూడా పనిచేసి.. వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళా అంపైర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు.

నాలుగేళ్లలో ఇదే తొలిసారి

నాలుగేళ్లలో ఇదే తొలిసారి

గాయం నుంచి కోలుకొని తిరిగి మూడో టెస్టు ఆడుతున్న స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ ‌(5)ను‌ మహ్మద్‌ సిరాజ్‌ బోల్తా కొట్టించాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వార్నర్‌ వేటాడడంతో స్లిప్‌లో చేటేశ్వర్ పూజారా చేతికి చిక్కాడు. వార్నర్‌ టెస్ట్ ఫార్మాట్‌లో సొంతగడ్డపై ఇలా 10 పరుగుల లోపే ఔటవ్వడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2016 నవంబర్‌ 12న దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టులో 1 పరుగుకే పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ఈరోజు 5 పరుగులకు ఔటయ్యాడు. వార్నర్ తన చివరి 25 హోమ్ టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 10 పరుగులకంటే ఎక్కువే చేశాడు. వార్నర్ చివరిసారిగా 2020 జనవరిలో ఇదే వేదికలో న్యూజిలాండ్‌తో హోమ్ టెస్ట్ ఆడాడు. 2వ ఇన్నింగ్స్‌లో అజేయంగా 111 పరుగులు చేశాడు. అంతకుముందు 45, 38, 41, 19, 43, 335 *, 154 స్కోర్లు నమోదు చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌!!

Story first published: Thursday, January 7, 2021, 11:15 [IST]
Other articles published on Jan 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X