న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs WI: లబుషేన్, స్మిత్ డబుల్.. వెస్టిండీస్ ట్రబుల్! బ్రాడ్ మాన్ రికార్డు సమం!

AUS vs WI: Steve Smith equals Don Bradmans 29 Test centuries record

పెర్త్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్(311 బంతుల్లో 17 ఫోర్లతో 200 నాటౌట్), మార్నస్ లబుషేన్(350 బంతుల్లో 20 ఫోర్లు, సిక్స్‌తో 204) డబుల్ సెంచరీతో చెలరేగారు. తమకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో అదరగొట్టారు. దాంతో 293/2 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 598/4 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.

ఓపెనర్ డేవిడ్ వార్నర్(5) విఫలమైనా.. ఉస్మాన్ ఖవాజా(65), ట్రావిస్ హెడ్(99) రాణించారు. విండీస్ బౌలర్లలో క్రైగ్ బ్రాత్ వైట్ రెండు వికెట్లు తీయగా.. జైడెన్ సీల్స్, కైల్ మేయర్స్ తలో వికెట్ పడగొట్టారు.

బ్రాడ్‌మన్ రికార్డు సమం..

బ్రాడ్‌మన్ రికార్డు సమం..

టెస్టుల్లో 29వ సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బ్రాడ్ మ్యాన్ రికార్డును సమం చేశాడు. స్మిత్ 155 ఇన్నింగ్స్‌ల్లో 29 సెంచరీలు చేయగా.. బ్రాడ్‌మాన్ 79 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 148వ ఇన్నింగ్స్‌ల్లో 29 శతకాన్ని పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రిక్కీ పాంటింగ్ (41) తొలి స్థానంలో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హెడెన్ (30) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

నాలుగో డబుల్ సెంచరీ..

నాలుగో డబుల్ సెంచరీ..

స్మిత్‌కు టెస్టుల్లో ఇది నాలుగో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. పెర్త్ టెస్టులో అద్భుతమైన ఆటతీరు కనబర్చిన స్మిత్ సగటు టెస్టుల్లో 61 దాటింది. ప్రస్తుత తరం క్రికెటర్లో మరే ఆటగాడు కూడా టెస్టు యావరేజ్ విషయంలో స్మిత్‌కు చేరువగా లేడు. కాగా టెస్టుల్లో కరేబియన్ జట్టుపై స్మిత్, మార్నస్ లబుషన్ యావరేజ్ 200కిపైగా ఉండటం విశేషం.

ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యధికంగా ఏడు డబుల్ సెంచరీలు చేయగా.. జో రూట్ 5 ద్విశతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. స్మిత్, విలియమ్సన్ తలో 4 డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఓవరాల్‌గా చూస్తే టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా డాన్ బ్రాడ్‌మాన్ (12) గుర్తింపు పొందాడు.

భారీ భాగస్వామ్యంతో..

భారీ భాగస్వామ్యంతో..

293/2 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ దూకుడుగా ఆడింది. బుధవారమే సెంచరీ పూర్తి చేసుకున్న లబుషేన్.. రెండో రోజు డబుల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇక స్మిత్ కూడా.. 59 పరుగుల వద్ద రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించి..సెంచరీతో పాటు ద్విశతకం అందుకున్నాడు.

లబూషేన్ తో కలిసి 251 పరుగులు జోడించిన స్మిత్.. తర్వాత ట్రావిస్ హెడ్ (99) తో కలిసి 196 పరుగులు జోడించాడు. స్మిత్ డబుల్ సెంచరీ పూర్తైన తర్వాత ట్రావిస్ హెడ్ సెంచరీ ముంగిట ఔట్ కావడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.

Story first published: Thursday, December 1, 2022, 15:36 [IST]
Other articles published on Dec 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X