న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs NZ: స్టీవ్ స్మిత్ శతకం.. క్రికెట్ బేసిక్స్ మరిచిన కేన్ మామ! ఆసీస్ చేతిలో కివీస్ క్లీన్ స్వీప్ (వీడియో)

AUS vs NZ: Steve Smith Shows Great Game Awareness, Slogs Jimmy Neesham Knowing Delivery Would Be No-Ball

కెయిర్న్స్: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు ఘన వీడ్కోలు లభించింది. వన్డే ఫార్మాట్‌కు టాటా చెప్పిన ఫించ్‌కు అతని చివరి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపుతో టాటా చెప్పింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో ఆసీస్ 25 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెరీర్ చివరి వన్డేలోనూ ఫించ్(5) విఫలమయ్యాడు.

స్మిత్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 267 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(131 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 105) సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(78 బంతుల్లో 2 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. అలెక్స్ క్యారీ(43 బంతుల్లో 3 ఫోర్లతో 42 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ, లాకీ ఫెర్గూసర్, సాంట్నర్ తలో వికెట్ తీసారు.

 ఫిలిప్స్ మినహా..

ఫిలిప్స్ మినహా..

అనంతరం న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 242 పరుగులకు కుప్పకూలింది. గ్లేన్ ఫిలిప్స్(47), జేమ్స్ నీషమ్(36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, సీన్ అబాట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు. ఈ సిరీస్ ఓటమి నేపథ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారథ్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేన్ మామ ఘోర తప్పిదం..

కేన్ మామ ఘోర తప్పిదం..

ముఖ్యంగా చివరి వన్డేలో ఫీల్డ్ సెటప్ విషయంలో అతను చేసిన ఘోర తప్పిదం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎంతటి టెన్షన్ మ్యాచ్‌లోనైనా దృడంగా ఉండే కేన్ మామ.. స్మిత్ ధాటికి ఘోర తప్పిదం చేశాడు. వన్డే నిబంధనల ప్రకారం 40 ఓవర్లకు ముందు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ కేన్ మామ ఈ విషయం మరిచి సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను ఉంచాడు.

 స్మిత్ తెలివిగా..

స్మిత్ తెలివిగా..

జేమ్స్ నీషమ్ వేసిన 38వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్మిత్.. సిక్స్ బాది నోబాల్ అంటూ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. సైగలతో ఫీల్డర్లను లెక్కపెట్టి మరి చెప్పాడు. దాంతో అంపైర్లు నో బాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చారు. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. వైరల్ అయ్యింది. దాంతో కేన్ మామపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Story first published: Sunday, September 11, 2022, 19:15 [IST]
Other articles published on Sep 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X