న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు తెలిసి సంతోషంగా ధోనీ చివరి మ్యాచ్‌ ఆడేశాడు: నెహ్రా

Ashish Nehra says this IPL cant be selection criteria for MS Dhoni

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు తెలిసి మహీ సంతోషంగా చివరి మ్యాచ్‌ కూడా ఆడేశాడని తెలిపాడు. అయితే ఐపీఎల్‌తో అతడి అంతర్జాతీయ క్రికెట్‌ ఏ మాత్రం ముడిపడిలేదన్నాడు. అతను ఆడాలని అనుకుంటే మాత్రం తన ఫస్ట్ చాయిస్ ధోనీనే అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.

చివరి మ్యాచ్ ఆడేశాడు..

‘ధోనీ అంతర్జాతీయ కెరీర్‌ ఐపీఎల్‌తో ముడిపడి ఉందని నేను అనుకోవడం లేదు. ధోనీ ఆడటానికి సిద్దంగా ఉంటే మాత్రం సెలెక్టర్, కెప్టెన్, కోచ్ ఎవరైనా అతను జట్టులోకి వస్తాడు. నాకు తెలిసి ధోనీ.. భారత్ తరఫున సంతోషంగా చివరి మ్యాచ్ ఆడేశాడు. అయితే ధోనీ నిరూపించుకోవాల్సింది కూడా ఏదీ లేదు. అతడింకా రిటైర్మెంట్‌ ప్రకటించకపోవడం వల్లే ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. త్వరలోనే మహీ ఒక నిర్ణయం తీసుకుంటాడు. అతని ఆలోచనలను స్వయంగా వెల్లడిస్తాడు. నా దృష్టిలో ధోనీ ఆట ఎప్పుడు దిగజారదు. ఈ విషయంపై ఇంతకు ముందు కూడా చర్చించాం.

 ఐపీఎల్ ఒరిగేదేం లేదు..

ఐపీఎల్ ఒరిగేదేం లేదు..

ఒకవేళ అతడు మళ్లీ ఆడడానికి సిద్ధంగా ఉంటే నేను సంతోషిస్తా. అలాగే న్యూజిలాండ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో ధోనీ క్రీజులో ఉన్నంత వరకు భారత్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. అతను రన్నౌటయ్యాక మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నారు. ఆ మ్యాచ్‌లో అతను పోరాడాని తీరు.. జట్టుకు ముందుకు తీసుకెళ్లిన సందర్భం.. యువ ఆటగాళ్లకు అండగా నిలిచిన తీరు ప్రతీ ఒక్కరికి తెలుసు. నేను మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఐపీఎల్ ధోనీపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపదు. ధోనీని ఎంపికచేయడానికి ఐపీఎల్ ప్రమాణం అవుతుందని నేను అనుకోవడం లేదు. అది మాట్లాడటానికి మాత్రమే'అని తెలిపాడు.

ప్రపంచకప్ తర్వాత..

ప్రపంచకప్ తర్వాత..

గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన సంగతి తెలిసిందే. అదే రోజు అతడు చివరిసారి మైదానంలో కనిపించాడు. అప్పుడు భారత జట్టు ఓటమిపాలయ్యాక ఆటకు దూరమయ్యాడు. దాంతో అప్పటి నుంచీ అతడి భవిష్యత్తు మీద అనేక సందేహాలు నెలకొన్నాయి. మహీ మళ్లీ టీమ్‌ఇండియా తరఫున ఆడతాడని అభిమానులు ఆశిస్తుండగా, అది కష్టమేనని పలువురు క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముమ్మర ప్రాక్టీస్..

ముమ్మర ప్రాక్టీస్..

ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ 2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) జట్టు మార్చిలో ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించింది. అందులో పాల్గొన్న ధోనీ ఈసారి బాగా ఆడాలని చాలా కష్టపడి సాధన చేసినట్లు సహచర ఆటగాళ్లు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు. అదే సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో అతడు తిరిగి రాంచీకి వెళ్లాడు. ఇక లాక్‌డౌన్‌ వేళ ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన సీఎస్కే కెప్టెన్‌ కుటుంబసభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదించాడు. మరోవైపు వాయిదా పడిన ఐపీఎల్‌ను వచ్చే నెల 19 నుంచి యూఏఈలో నిర్వహించాలని చూస్తుండగా సీఎస్కే ఈనెల రెండో వారంలోనే అక్కడికి వెళ్లాలని చూస్తోంది. దీంతో అన్ని జట్ల కన్నా ముందే ఆ జట్టు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలని భావిస్తోంది.

భారత ఆటగాళ్లలో ఆ ఇద్దరు నా ఫేవరేట్: షాహిద్ అఫ్రిది

Story first published: Sunday, August 2, 2020, 20:09 [IST]
Other articles published on Aug 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X