న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత ఆటగాళ్లలో ఆ ఇద్దరు నా ఫేవరేట్: షాహిద్ అఫ్రిది

Former Pakistan skipper Shahid Afridi names his two favourite batsmen from India

కరాచీ: భారత్ అంటేనే విద్వేషంతో రగిలిపోయే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. ఇండియా క్రికెటర్లలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన ఫేవరేట్ బ్యాట్స్‌మెన్ అని తెలిపాడు. మహమ్మారి కరోనా వైరస్‌ను జయించిన ఈ పాక్ మాజీ స్పిన్నర్ ఇటీవల అభిమానులతో ట్విటర్ వేదికగా చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా బదులిచ్చాడు.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని 'భారత్‌ ఆటగాళ్లలో నీ ఫేవరేట్ బ్యాట్స్‌మన్ ఎవరు'అని ప్రశ్నించాడు. దీనికి అఫ్రిది.. కోహ్లీ, రోహిత్ శర్మ అని సమాధానమిచ్చాడు. ప్రస్తుత తరంలో తన ఫేవరేట్ బౌలర్ ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అని తెలిపిన అఫ్రిది.. ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ వీవీ రిచర్డ్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌లకు బౌలింగ్ చేయడం చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

Former Pakistan skipper Shahid Afridi names his two favourite batsmen from India
ధోనీనే బెస్ట్..

ధోనీనే బెస్ట్..

మరో అభిమాని..‘ధోనీ, పాంటింగ్‌లో బెస్ట్ కెప్టెన్? లాలా చాయిస్?'అని ప్రశ్నించాడు. దీనికి అఫ్రిది తనకు బెస్ట్ కెప్టెన్ ధోనీనే అని బదులిచ్చాడు. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. ‘నా దృష్టిలో పాంటింగ్ కన్నా ధోనీనే గొప్ప బ్యాట్స్‌మన్. ఎందుకంటే అతను యువ ఆటగాళ్లతో కూడిన జట్టును తయారు చేసుకున్నాడు.'అని పాకిస్థాన్ తరఫున 27 టెస్ట్‌లు, 398 వన్డేలు ఆడిన అఫ్రిది పేర్కొన్నాడు.

 కరోనాను జయించి..

కరోనాను జయించి..

గత నెల 13న కరోనా బారిన పడిన అఫ్రిది కుటుంబం 15 రోజుల చికిత్స అనంతరం కోలుకుంది. 'ఆ అల్లా దయవల్ల నేను, నా సతీమణి, కూతుళ్లు అక్సా, అన్షా కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. మేం కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధించిన మీ అందరికి కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయమిది'అని అఫ్రిది అప్పట్లో ట్వీట్‌ చేశాడు.

రికార్డుల రారాజులు..

రికార్డుల రారాజులు..

తమదైన ఆటతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నారు. 31 ఏళ్ల కోహ్లీ సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 86 టెస్ట్‌లు, 248 వన్డేలు, 82 టీ20ల్లో ఈ పరుగులు యంత్రం 20వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక రోహిత్ గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులతో టోర్నీ టాపర్‌గా నిలిచాడు. వన్డేల్లో ట్రిపుల్ డబుల్ సెంచరీలతో అరుదైన రికార్డును నెలకొల్పాడు.

Story first published: Sunday, August 2, 2020, 14:46 [IST]
Other articles published on Aug 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X