న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెహ్రా ఐపీఎల్ 2020 టీమ్.. రోహిత్, కోహ్లీలకు షాక్.. నలుగురు ముంబై ఆటగాళ్లకు చోటు!!

Ashish Nehra picks his best IPL 2020 Team, choose Suryakumar Yadav at No.3

హైదరాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. నవంబర్ 10న ఐపీఎల్ 2020 ముగిసిన నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తన డ్రీమ్ జట్టును ప్రకటించాడు. ఈ సీజన్లో ఎనమిది జట్ల క్రికెటర్ల ఆటతీరు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసినట్టు నెహ్రా తెలిపాడు. అయితే విరాట్ కోహ్లిని పక్కనబెట్టిన నెహ్రా.. అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు తన డ్రీమ్ జట్టులో చోటిచ్చాడు.

 కోహ్లీ బదులు సూర్యకుమార్

కోహ్లీ బదులు సూర్యకుమార్

ఆశిష్ నెహ్రా తన డ్రీమ్ జట్టు ఓపెనర్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేసుకున్నాడు. 670 రన్స్‌తో రాహుల్ ఆరెంజ్ క్యాప్ సాధించగా.. వార్నర్ కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడో స్థానంలో ముంబై ఇండియన్స్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్‌ను నెహ్రా ఎంపిక చేశాడు. సూర్యకుమార్ గత మూడు సీజన్లుగా నిలకడగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసీజన్లో కూడా పరుగుల వరద పారించాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని ఎంపిక చేయలేదన్నాడు. కోహ్లీ పరుగులు చేయలేదని కాదు.. కానీ సూర్యకుమార్ చేసిన పరుగుల ప్రభావం ఎక్కువని పేర్కొన్నాడు.

కీపర్‌గా ఇషాన్ కిషన్

కీపర్‌గా ఇషాన్ కిషన్

నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేసిన ఆశిష్ నెహ్రా.. అతడు లేకుండా టీ20 జట్టేదీ ఉండదన్నాడు. ఐదో స్థానంలో ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ ఇషాన్ కిషన్, ఆరో స్థానంలో ముంబై ఇండియన్స్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసుకున్నాడు. ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్‌ను తన జట్టు వికెట్ కీపర్‌గా నెహ్రా తీసుకున్నాడు.

చివరి స్థానం కోసం ఇద్దరు

చివరి స్థానం కోసం ఇద్దరు

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను తన జట్టులోకి తీసుకున్న ఆశిష్ నెహ్రా.. వీరిద్దరూ బ్యాటింగ్ కూడా చేయగలరన్నాడు. బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రాను నెహ్రా తన జట్టులోకి తీసుకున్నాడు. చివరి స్థానం కోసం మొహమ్మద్ షమీ, ఆర్ అశ్విన్‌లు ఎంచుకున్నాడు. ముగ్గురు పేసర్లతో ఆడాల్సి వస్తే షమీని తుది జట్టులోకి తీసుకుంటానని.. లేదంటే అశ్విన్‌ను ఎంపిక చేస్తానని నెహ్రా చెప్పాడు. ఎంఎస్ ధోనీని పక్కనబెట్టడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ.. ఈ సీజన్లో మహీ ఆకట్టుకోలేదని వివరణ ఇచ్చాడు. అయితే తన జట్టుకు కెప్టెన్ ఎవరనేది మాత్రం నెహ్రా చెప్పలేదు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. దక్షిణాఫ్రికా టీమ్‌లో కరోనా కలకలం!!

ఆశిష్ నెహ్రా ఐపీఎల్ 2020 డ్రీమ్ జట్టు

ఆశిష్ నెహ్రా ఐపీఎల్ 2020 డ్రీమ్ జట్టు

కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్‌, ఏబీ డివిలియర్స్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జోఫ్రా ఆర్చర్, రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ/ఆర్ అశ్విన్‌.

Story first published: Thursday, November 19, 2020, 14:23 [IST]
Other articles published on Nov 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X