న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2021: పాపం లబుషేన్.. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఔట్ చూసుండరు! (వీడియో)

Ashes 2021: Marnus Labuschagne Slips And Loses His Wicket To Stuart Broad

హోబర్ట్: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. అసలు ఇలాంటి ఔట్‌ను క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగుండరు. అవును.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సూపర్ బౌలింగ్‌కు లబుషేన్(53 బంతుల్లో 9 ఫోర్లతో 44) నిరాశగా పెవిలియన్ చేరాడు. అసలేం జరిగిందంటే.. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 23వ ఓవర్ తొలి బంతికి లబుషేన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

బ్రాడ్.. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వేస్తాడని భావించిన లబుషేన్ ముందుగా ఆఫ్ స్టంప్‌ వైపు జరిగి బంతి కోసం సిద్దంగా ఉన్నాడు. అతని స్టాన్స్ గమనించిన బ్రాడ్ తెలివిగా.. వికెట్ టు వికెట్ స్ట్రైట్ డెలివరీ వేసాడు. దాంతో అవాక్కైన లబుషేన్ ఆ బంతిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసాడు. కానీ బ్యాలెన్స్ తప్పి బొక్కబోర్లపడ్డాడు. బంతికాస్త అతని లెస్ట్ స్టంప్‌ను ఎగరగొట్టేసింది. దాంతో ఇంగ్లండ్ సంబరాలు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు గట్టిషాక్ తగిలింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(0) డకౌటవ్వగా.. సెంచరీల హీరో ఉస్మాన్ ఖవాజా(6) కూడా నిరాశపరిచాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(0) డకౌటయ్యాడు. దాంతో ఆస్ట్రేలియా 12 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన లబుషేన్, ట్రావిస్ హెడ్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. బౌండరీలతో జోరు కనబర్చాడు. ఇక హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతను చివరకు బ్రాడ్ బౌలింగ్‌లో విచిత్రక రీతిలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్(74)తో కలిసి ట్రావిస్ హెడ్(101) శతకంతో చెలరేగాడు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ 60.3 ఓవర్లలో6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.

ఇక ఆసీస్‌ ఇప్పటికే 3-0 తేడాతో ఆసీస్‌ సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్టు డ్రాకాగా... ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది.

Story first published: Friday, January 14, 2022, 21:57 [IST]
Other articles published on Jan 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X