న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2021-22: లబుషేన్ సెంచరీ.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్‌కు మళ్లీ చుక్కలే! రెండో రోజూ ఆసీస్‌దే!

Ashes 2021-22: Australia Take Control, Remove England Openers Early After Marnus labuschagne Century

అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి రోజు బ్యాటింగ్‌లో సత్తా చాటి పైచేయి సాధించిన ఆ జట్టు.. రెండో రోజు అదే జోరును కొనసాగించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(305 బంతుల్లో 8 ఫోర్లతో 103) సూపర్ సెంచరీ బాదగా.. స్టీవ్ స్మిత్(201 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 93) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరికి అండగా.. అలెక్స్ క్యారీ(107 బంతుల్లో 5 ఫోర్లు 51), మిచెల్ స్టార్క్(39 బంతుల్లో 5 ఫోర్లతో 39 నాటౌట్), మైకేల్ నెసర్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) ధనాధన్ బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు చేశారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్ 473/9 వద్ద డిక్లేర్ ఇచ్చింది.

ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ మూడు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, జోరూట్ తలో వికెట్ తీశారు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8.4 ఓవర్లలో 2 వికెట్లకు 17 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్(4)ను మిచెల్ స్టార్క్ ఔట్ చేయగా.. మరో ఓపెనర్ హసీబ్ హమీద్(6)ను అరంగేట్ర ప్లేయర్ మైకేల్ నెసర్ పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లండ్ ఇంకా 456 పరుగుల వెనుకంజలో ఉంది. ఆట చివర్లో డిక్లేర్ ఇచ్చి ఆస్ట్రేలియా పన్నిన పన్నాగం సక్సెస్ అయింది. దాంతో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.

221/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ప్రారంభించగా.. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ లబుషేన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జేమ్స్ అండర్సన్ వేసిన 94 ఓవర్ మూడో బంతిని బౌండరీ బాదిన లబుషేన్.. యాషెస్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. ఓవరాల్‌గా అతనికిది ఆరో సెంచరీ. ఆ వెంటనే రాబిన్సన్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇవ్వగా.. అది నో బాల్ కావడంతో లక్కీగా మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే ఆ కొద్దిసేపటికే రాబిన్సన్ బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్(8), గ్రీన్(2)‌తో స్మిత్ సహనంగా బ్యాటింగ్ చేశాడు. ట్రావిస్ హెడ్ (18), గ్రీన్ (2) విఫలమైనా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్స్ క్యారీ (51) హాఫ్ సెంచరీ సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇక సెంచరీకి చేరువైన స్మిత్‌ను అండర్సన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. సెషన్‌లో మిచెల్ స్టార్క్ (39 నాటౌట్), నజీర్ (35) విలువైన పరుగులు చేశారు.

Story first published: Friday, December 17, 2021, 18:29 [IST]
Other articles published on Dec 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X