న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌లో వరుసగా 500లకుపైగా పరుగులు.. రికార్డుల్లో స్మిత్!!

Ashes 2019: Steve Smith becomes 2nd Australian to score 500 runs in consecutive Ashes

మాంచెస్టర్‌: ఇటీవల నంబర్‌ వన్‌ టెస్టు బ్యాట్స్‌మన్‌గా నిలిచిన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఒక్క డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులు తిరగరాస్తున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో స్మిత్ డబుల్‌ సెంచరీ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో చెలరేగాడు. దీంతో ఇంగ్లాండ్‌లో వరుస యాషెస్‌లలో 500లకు పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డులోకి ఎక్కాడు.

<strong>గ్యారీ సోబర్స్‌ను వెనక్కినెట్టిన స్మిత్.. బ్రాడ్‌మాన్ రికార్డుపై కన్ను!!</strong>గ్యారీ సోబర్స్‌ను వెనక్కినెట్టిన స్మిత్.. బ్రాడ్‌మాన్ రికార్డుపై కన్ను!!

అలెన్ బోర్డర్ మాత్రమే:

అలెన్ బోర్డర్ మాత్రమే:

ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల్లో స్మిత్ 378 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో 122 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్ 500 పరుగుల మార్క్ అందుకున్నాడు. 2015లో ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్‌లో స్మిత్ 508 పరుగులు సాధించగా.. ఈసారి తన మూడో మ్యాచ్‌లోనే 500 పరుగుల మార్కును అధిగమించాడు. స్మిత్‌కు ముందు అలెన్ బోర్డర్ ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్‌లో వరుసగా 500లకుపైగా పరుగులు సాధించాడు. బోర్డర్ 1981 మరియు 1985 యాషెస్ సిరీస్‌లలో 500కి పైగా పరుగులు చేశాడు.

మూడుసార్లు 500లకు పైగా పరుగులు:

మూడుసార్లు 500లకు పైగా పరుగులు:

యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ మూడుసార్లు 500లకు పైగా పరుగులు చేశాడు. సర్ డోనాల్డ్ బ్రాడ్‌మన్‌ (5), సర్ జాక్ హోబ్స్ (3) మాత్రమే మూడు యాషెస్ సిరీస్‌లో 500లకు పైగా పరుగులు చేశారు. అయితే స్మిత్ వరుసగా మూడు సిరీస్‌లలో 500లకు పైగా పరుగులు చేయడం విశేషం. టెస్ట్ ఫార్మాట్‌లో స్మిత్ 26వ సెంచరీ చేసాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో 26 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ను దాటి రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు చేయగా.. సచిన్ 136 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు.

26వ టెస్టు సెంచరీ:

26వ టెస్టు సెంచరీ:

ఇప్పటివరకూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 25 టెస్టు సెంచరీలు సాధిస్తే.. స్మిత్‌ 26వ టెస్టు సెంచరీలు చేసాడు. యాషెస్‌లో వరుసగా ఎనిమిది సార్లు 50+ స్కోరుని సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ యాషెస్‌లో చివరి 8 ఇన్నింగ్స్‌ల్లో 239, 76, 102*, 83, 144, 142, 92, 211 పరుగులు చేసాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి.

'సచిన్‌ 100 సెంచరీల రికార్డును కోహ్లీనే బ్రేక్‌ చేస్తాడు'

ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు:

ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు:

ఇంగ్లండ్‌పై సాధించిన తాజా సెంచరీ స్మిత్‌కు 11వది. దీంతో ఇంగ్లండ్‌ జట్టుపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్‌ (10)ను అధిగమించి ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో సర్ డాన్ బ్రాడ్‌మాన్ (19) అగ్రస్థానంలో ఉన్నాడు. మరొకవైపు ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక టెస్టు సెంచరీలు జాబితాలో స్మిత్‌ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మన్‌ (19 సెంచరీలు, ఇంగ్లండ్‌పై), సునీల్‌ గావస్కర్‌ (13 సెంచరీలు, వెస్టిండీస్‌పై), జాకబ్‌ హాబ్స్‌ (12 సెంచరీలు, ఆసీస్‌పై)లు స్మిత్‌ కంటే ముందు ఉన్నారు.

Story first published: Friday, September 6, 2019, 16:00 [IST]
Other articles published on Sep 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X