'సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీనే బ్రేక్ చేస్తాడు'

మాంచెస్టర్: టీమిండియా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును భారత కెప్టెన్ విరాట్ కోహ్లీనే బ్రేక్ చేస్తాడు అని ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే కోహ్లీనే గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ అని ఆయన అన్నాడు. అంతేకాదు స్టీవ్ స్మిత్ టెస్టు ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆటగాడు అని పేర్కొన్నాడు.

కోహ్లీ ఓ లెజండ్:
తాజాగా షేన్ వార్న్ మాట్లాడుతూ... ' టెస్టు ఫార్మాట్‌లో స్మిత్, కోహ్లీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు. కానీ..టెస్ట్ క్రికెట్లో ఒక బ్యాట్స్‌మన్‌ను ఎన్నుకోవలసి వస్తే స్మిత్‌కే ఓటేస్తా. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఒక బ్యాట్స్‌మన్‌ను ఎన్నుకోవలసి వస్తే కోహ్లీని సూచిస్తా. అతను ఒక లెజండ్' అని వార్న్ అన్నాడు.

గొప్ప వన్డే బ్యాట్స్‌మన్:
'వివ్ రిచర్డ్స్ వన్డే క్రికెట్లో మరియు అన్ని క్రికెట్లలో నేను చూసిన గొప్ప బ్యాట్స్‌మన్. విరాట్ ఇప్పుడు గొప్ప వన్డే బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతను వివ్ రిచర్డ్స్‌ను కూడా అధిగమించాడు. సచిన్ 100 సెంచరీల రికార్డు ప్రమాదంలో ఉందని భావిస్తున్నా. ఆ రికార్డును కోహ్లీనే బ్రేక్ చేస్తాడు. సచిన్.. విరాట్ మీ కోసం వస్తున్నాడు. నాథన్ లియాన్ కూడా నా 708 టెస్ట్ వికెట్లను అదిమించే అవకాశం ఉంది' అని వార్న్ పేర్కొన్నాడు.
అనుష్కతో కోహ్లీ మొదటిసారి ఏం మాట్లాడాడో తెలుసా?

అద్భుతమైన నాయకుడు:
'కోహ్లీ అన్ని రికార్డులను బద్దలు కొడతాడని నేను భావిస్తున్నా. అత్యుత్తమ బౌలర్లపై కూడా అతని ఆట అద్భుతం. అతనికి నేను పెద్ద అభిమానిని. ఇదే విషయం ఇదివరకే నేను బహిరంగంగా కూడా చెప్పా. అన్ని రకాల ఫార్మాట్‌లలో విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అంతేకాదు అద్భుతమైన నాయకుడు. అన్నిటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. కోహ్లీ రోజురోజుకి మెరుగుపడుతున్నాడు' అని వార్న్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications