న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు జెర్సీలపై పేర్లు, నంబర్లు చెత్తగా ఉన్నాయి: ట్విట్టర్‌లో గిల్లీ

Ashes 2019: ‘Names and numbers are rubbish’ - Adam Gilchrist hits out at new ICC initiative

హైదరాబాద్: జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు చాలా చెత్తగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు ముద్రించిన సంగతి తెలిసిందే.

'సెంచరీ బాదిన స్మిత్‌ను ఎగతాళి చేయడం నిరాశకు గురిచేసింది''సెంచరీ బాదిన స్మిత్‌ను ఎగతాళి చేయడం నిరాశకు గురిచేసింది'

క్రికెటర్లను అభిమానులను గుర్తించేందుకు

క్రికెటర్లను అభిమానులను గుర్తించేందుకు

మైదానంలో ఆడుతోన్న క్రికెటర్లను అభిమానులను గుర్తించేందుకు ఐసీసీ కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. 142 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఇలా జెర్సీలపై ఆటగాళ్ల పేర్లతో పాటు నంబర్లను ముద్రించడం ఇదే తొలిసారి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా యాషెస్‌ సిరీస్‌ నుంచి ఈ సంప్రదాయానికి తెరలేపారు.

100 యాషెస్‌ వికెట్లు.. స్టువర్ట్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు

చెత్తగా ఉందన్న గిల్‌క్రిస్ట్

అయితే టెస్టు జెర్సీలపై క్రికెటర్ల పేర్లూ, నంబర్లు ముద్రించడం చాలా చెత్తగా ఉందని మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. "ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. మనమింకా పోటీలో ఉన్నాం. ఇలా చెబుతున్నందుకు మన్నించండి. కానీ.. జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు నచ్చడం లేదు" అని ఒక ట్వీట్‌ చేశాడు.

నా క్షమాపణల్ని వెనక్కి తీసుకుంటున్నా

ఆ తర్వాత మరొక ట్వీట్‌లో "నిజం చెప్పాలంటే నా క్షమాపణల్ని వెనక్కి తీసుకుంటున్నా. పేర్లూ, నంబర్లు చెత్తగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ యాషెస్‌ను ఆస్వాదించండి" అని గిల్ క్రిస్ట్ ట్వీట్ చేశాడు. కాగా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ యాషెస్ సిరిస్‌తోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఆ అధికారం లేదు: బీసీసీఐకి కేంద్ర క్రీడాశాఖ మధ్య చిచ్చు పెట్టిన పృథ్వీ షా నిషేధం

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది జట్లు

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది జట్లు

ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొమ్మిది జట్లు 71 మ్యాచ్‌ల్లో 27 ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు ఆడనున్నాయి. ప్రతీ జట్టూ మిగిలిన ఎనిమిది జట్లలోని ఏవైనా ఆరు జట్లతో తలపడనున్నాయి. ఇందులో భాగంగా మూడు సిరీస్‌లు స్వదేశంలో ఆడగా మిగతా మూడు సిరిస్‌లు విదేశాల్లో ఆడతాయి.

Story first published: Friday, August 2, 2019, 18:05 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X