న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 యాషెస్‌ వికెట్లు.. స్టువర్ట్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు

Ashes 2019, England vs Australia 1st Test: Stuart Broad 19th bowler to bags 100 Ashes wickets

ఎడ్జ్‌బాస్టన్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్ సమరం గురువారం ప్రారంభమైంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ స్టార్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు అందుకున్నాడు. యాషెస్‌లో 100 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న 19వ బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్‌.

సోషల్‌ మీడియాలో వైరల్‌: రోహిత్‌ లేకుండా టీమిండియా ఫొటో.. అభిమానుల ఆగ్రహంసోషల్‌ మీడియాలో వైరల్‌: రోహిత్‌ లేకుండా టీమిండియా ఫొటో.. అభిమానుల ఆగ్రహం

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన యాషెస్ టెస్టు మొదటి రోజు స్టీవ్ స్మిత్ వికెట్ తీయడంతో బ్రాడ్ ఈ ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసాడు. డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, టిమ్ పైన్, జేమ్స్ ప్యాటిన్సన్‌లను పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్ బౌలర్ షేన్ వార్న్ అత్యధిక యాషెస్ వికెట్లు (195) సాధించాడు. ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ 104 వికెట్లు తీసాడు. అండర్సన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీయలేదు. అతడు బౌలింగ్‌ చేస్తుండగా.. కుడికాలి కండరం పట్టేయడంతో మైదానాన్ని వీడాడు.

స్టీవ్‌ స్మిత్‌ కూడా ఓ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 24వ సెంచరీ చేశాడు. కేవలం 118 ఇన్నింగ్స్‌లలో స్మిత్ 24వ సెంచరీ నమోదు చేసాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (123)ని అధిగమించాడు. క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ (66) ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (125) నాలుగో స్థానంలో ఉన్నాడు.

సానియా రెండో ఇన్నింగ్స్‌.. ఇక సాధించేవన్నీ బోనస్‌లేసానియా రెండో ఇన్నింగ్స్‌.. ఇక సాధించేవన్నీ బోనస్‌లే

బ్రాడ్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ జట్టును మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. స్మిత్‌కు బౌలర్ పీటర్‌ సిడిల్‌ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) సహకరించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 10 పరుగులు చేసింది.

Story first published: Friday, August 2, 2019, 15:36 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X