న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ అధికారం లేదు: బీసీసీఐకి కేంద్ర క్రీడాశాఖ మధ్య చిచ్చు పెట్టిన పృథ్వీ షా నిషేధం

BCCI gets a dose from Govt: You don’t have authority to test players for drugs

హైదరాబాద్: డోపీగా తేలిన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను బీసీసీఐ 8 నెలలు పాటు నిషేధించడం కొత్త వివాదనికి దారి తీసింది. నిజానికి క్రికెటర్లకు డోప్‌ టెస్ట్‌లు నిర్వహించే అధికారం బీసీసీఐకి లేదని స్పష్టం చేసిన కేంద్ర క్రీడల శాఖ... అసలు బోర్డు ఎలా డోప్ టెస్ట్‌లు నిర్వహిస్తోందని ప్రశ్నించింది.

డోపీగా తేలిన పృథ్వీ షా: 8 నెలలు నిషేధం, ట్విట్టర్‌లో వివరణ, పుల్ టెక్ట్స్ చదవండిడోపీగా తేలిన పృథ్వీ షా: 8 నెలలు నిషేధం, ట్విట్టర్‌లో వివరణ, పుల్ టెక్ట్స్ చదవండి

ఈ మేరకు బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రీకి కేంద్ర క్రీడల శాఖ లేఖ రాసింది. బీసీసీఐ ఆటగాళ్లకు నిర్వహిస్తోన్న డోప్‌ టెస్ట్‌లు అధ్వాన్నంగా ఉన్నాయని అందులో పేర్కొంది. డోప్ టెస్ట్‌లు, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని కేంద్ర క్రీడల శాఖ ఆ లేఖలో పేర్కొంది.

అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్‌ టెస్ట్‌లు నిర్వహించాలని మరోమారు బోర్డుకు సూచించింది. అంతేకాదు బీసీసీఐకి వాడా గుర్తింపు లేదని పేర్కొంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ డోపింగ్‌ టెస్టులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయన్న పేర్కొనడం విశేషం.

ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో పృథ్వీ షా విఫలమయ్యాడు. అతడి మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీంతో డోపింగ్‌ నిబంధనల ఉల్లంఘన కమిటీ బీసీసీఐ ఏడీఆర్‌ ఆర్టికల్‌ 2.1 ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంది.

యాషెస్‌లో ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేయడం బాధించలేదు'యాషెస్‌లో ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేయడం బాధించలేదు'

8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించింది. పృథ్వీ షాపై విధించిన నిషేధం నవంబరు 15తో ముగియనుంది. పృథ్వీ షాతో పాటు అక్షయ్‌ దివాల్కర్‌, దివ్య గజ్‌రాజ్‌ అనే ఇద్దరు దేశవాళీ క్రికెటర్లూ డోపీలుగా తేలారు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడటంతో ఆ సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు.

అయితే, గాయ నుంచి కోలుకుని ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన షా... ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుఫున ఐపీఎల్‌ ఆడాడు. కాగా, ఇటీవలే తుంటి గాయానికి గురైన పృథ్వీ షా వెస్టిండీస్‌-ఎతో భారత్‌-ఎ వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ గాయం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Story first published: Friday, August 2, 2019, 13:50 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X