న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ సిరీస్ 2019.. నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు శుభవార్త!!

Ashes 2019: James Anderson steps up recovery from injury ahead of fourth Test

మాంచెస్టర్: యాషెస్ మూడో టెస్టులో అనూహ్య విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఇంగ్లండ్‌కు శుభవార్త అందింది. నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌, స్వింగ్ మాస్టర్ జేమ్స్‌ అండర్సన్‌ మోకాలి గాయం నుండి కోలుకున్నాడు. అంతేకాదు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని సమాచారం తెలుస్తోంది. 37 ఏళ్ల అండర్సన్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి యాషెస్ టెస్టులో గాయం కారణంగా అర్థంతరంగా తప్పుకున్న అండర్సన్‌.. లార్డ్స్‌, హెడింగ్లీ టెస్టులలోనూ ఆడలేదు.

ఛాంపియన్‌షిప్‌ కోసం సింధు జిమ్‌లో ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే!! (వీడియో)ఛాంపియన్‌షిప్‌ కోసం సింధు జిమ్‌లో ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే!! (వీడియో)

20 ఓవర్లు.. 38 పరుగులు:

20 ఓవర్లు.. 38 పరుగులు:

ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగవ యాషెస్ టెస్టుకు ఫిట్‌నెస్‌ నిరూపించే దిశగా జేమ్స్ అండర్సన్‌ మరో అడుగు ముందుకు వేసాడు. ఆండర్సన్ మంగళవారం లాంక్షైర్ ఎలెవన్ తరఫున 20 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. 20 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు. ఈ మ్యాచ్ ద్వారా సెప్టెంబర్ 4 నుండి ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే నాలుగవ టెస్టులో అండర్సన్ తన స్థానాన్ని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి.

జాక్‌ లీచ్‌పై వేటు?:

జాక్‌ లీచ్‌పై వేటు?:

ఒకవేళ అండర్సన్ జట్టులోకి వస్తే జాక్‌ లీచ్‌పై వేటు పడే అవకాశ ఉంది. ఎందుకంటే.. జిమ్మీ స్థానంలో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న జోఫ్రా ఆర్చర్‌ తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇక మూడో టెస్టులో కూడా 8 వికెట్లతో సత్తా చాటాడు. స్టువర్ట్ బ్రాడ్, క్రిస్‌ వోక్స్‌లను తప్పించే సాహసంను ఈసీబీ చేయదు. లీచ్‌ మూడో టెస్టులో కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అయితే బంతినే పట్టుకోలేదు. దీంతో లీచ్‌పై వేటు పడే అవకాశ ఉంది. అయితే విన్నింగ్స్ జట్టునే కొనసాగించాలనుకుంటే.. జిమ్మీకి నిరాశ తప్పదు.

సిరీస్‌పై పట్టు బిగించాలని:

సిరీస్‌పై పట్టు బిగించాలని:

మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఒక వికెట్ తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సహచర ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నా.. బెన్‌ స్టోక్స్‌ (219 బంతుల్లో 135 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. మూడో టెస్ట్ విజయంలో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఆసీస్‌ ఘన విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌పై పట్టు బిగించాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి.

నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా.. బీసీసీఐ పెద్దల ఫోన్‌ నంబర్లు ట్రాప్!!

నాలుగో టెస్టుకు జట్టు (అంచనా):

నాలుగో టెస్టుకు జట్టు (అంచనా):

జో రూట్‌ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టో, స్టువార్ట్‌ బ్రాడ్‌, బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, స్యామ్‌ కరన్‌, జో డెన్లీ, జాక్‌ లీచ్‌/అండర్సన్ , జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌.

Story first published: Wednesday, August 28, 2019, 13:13 [IST]
Other articles published on Aug 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X