Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా.. బీసీసీఐ పెద్దల ఫోన్‌ నంబర్లు ట్రాప్!!

FIR lodged for fake Facebook profile of former cricketer Sandeep Patil

ముంబై: బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌, మాజీ క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌ పేరుతొ ఓ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచి బీసీసీఐలోని పెద్దల ఫోన్‌ నంబర్లను అడుగుతున్నాడు. స్నేహితుడు ద్వారా ఈ విషయం తెలుసుకున్న సందీప్‌ పాటిల్‌ సంబంధిత ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. మిథాలీకి చోటు దక్కేనా?

బీసీసీఐ పెద్దల ఫోన్‌ నంబర్లు ట్రాప్:

బీసీసీఐ పెద్దల ఫోన్‌ నంబర్లు ట్రాప్:

విషయంలోకి వెళితే... సందీప్‌ పాటిల్‌ పేరుతొ ఓ వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి పాటిల్‌ స్నేహితుడు ఆనంద్‌ యల్విజీకి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు. మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్స్‌ 13 మంది ఉండడంతో అతను రిక్వెస్ట్‌ దృవీకరించాడు. వెంటనే మాజీ క్రికెటర్లు, బీసీసీఐలోని పెద్దల ఫోన్‌ నంబర్లు అడిగాడు. అనుమానం వచ్చిన ఆనంద్‌ తన మిత్రుడు పాటిల్‌కి ఫోన్‌ చేయడంతో విషయం తెలిసింది.

అనుమానం వచ్చి పాటిల్‌కు ఫోన్‌ చేశా:

అనుమానం వచ్చి పాటిల్‌కు ఫోన్‌ చేశా:

ఆనంద్‌ మాట్లాడుతూ... 'పాటిల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ వచ్చింది. మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్స్‌ 13 మంది ఉన్నారు. దీంతో రిక్వెస్ట్‌ అంగీకరించా. వెంటనే బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి ఫోన్ నెంబర్ అడిగాడు. ఆ తర్వాత డయానా ఎడుల్జీ నంబర్‌ అడిగాడు. ఆపై నా నంబర్‌ కూడా అడిగాడు. నేను ఇచ్చాను. కానీ.. ఛాటింగ్‌ శైలి చూస్తుంటే అనుమానం వచ్చి పాటిల్‌కు ఫోన్‌ చేయడంతో విషయం తెలిసింది. వెంటనే సదరు ఖాతాను బ్లాక్‌ చేశా' అని ఆనంద్‌ తెలిపాడు. సునిల్‌ గావస్కర్‌, గౌతమ్‌ భిమాని నంబర్లు సైతం అడిగాడని సమాచారం.

ఎఫ్‌ఐఆర్ నమోదు:

ఎఫ్‌ఐఆర్ నమోదు:

పాటిల్ మాట్లాడుతూ... ఆగస్టు 19న శివాజీ పార్క్‌ జింఖానా మైదానం వద్ద మిత్రులతో ఉన్న సమయంలో ఆనంద్‌ ఫోన్ చేసాడు. తన పేరుతో నకిలీ ఖాతా ఉందని తెలియడంతో ఆశ్చర్యపోయా. తనకెలాంటి సోషల్‌ మీడియా ఖాతాలు లేవని అతడికి చెప్పా. తన మిత్రుల నంబర్లు ఎందుకు అడుగుతా' అని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐకి సైతం ఇదే విషయం స్పష్టం చేశాడు. నకిలీ ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Story first published: Wednesday, August 28, 2019, 11:43 [IST]
Other articles published on Aug 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+