న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ రెండో టెస్టు: ఉత్కంఠ రేపినా.. చివరకు డ్రానే!!

Ashes 2019: Head unbeaten on 42 after Labuschagnes fifty, Australia repel England to draw second Test

లండన్: యాషెస్‌ రెండో టెస్టు అనూహ్య మలుపులు తిరుగుతూ చివరకు డ్రాగా ముగిసింది. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 47.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. మొదటగా బెన్‌ స్టోక్స్ (115 నాటౌట్‌; 165 బంతుల్లో 11×4, 3×6) అద్భుత శతకంతో అలరించగా.. అనంతరం జోఫ్రా ఆర్చర్‌ (3/23) ధాటికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. ఆర్చర్‌ నిప్పులు చెరిగే బంతులతో కంగారూ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. స్టోక్స్, ఆర్చర్‌ తమ జట్టును గెలిపించేందుకు శతవిధాల కృషిచేశారు.

<strong>హోరాహోరీ పోరులో పుణేరి, తలైవాస్‌ మ్యాచ్‌ 'టై'</strong>హోరాహోరీ పోరులో పుణేరి, తలైవాస్‌ మ్యాచ్‌ 'టై'

ఆదుకున్న లబ్‌షేన్:

ఆదుకున్న లబ్‌షేన్:

ఆర్చర్‌, జాక్‌ లీచ్‌ ధాటికి లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్‌ (5), బాన్‌క్రాఫ్ట్‌ (16).. ఉస్మాన్ ఖవాజా (2)లు త్వరగానే పెవిలియన్ చేరారు. దీంతో ఆస్ట్రేలియా 14 ఓవర్లకు 47/3తో నిలిచింది. ఆట ముగియడానికి ఇంకా 34 ఓవర్లు ఉండడంతో ఆస్ట్రేలియా ఆలౌట్‌ అవుతుందేమో అని అనిపించింది. అయితే స్మిత్‌ స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోదిగిన లబ్‌షేన్ (59) కీలక ఇన్నింగ్స్‌ ఆడి అర్ధ శతకంతో ఆదుకున్నాడు.

హెడ్‌ పట్టుదల:

హెడ్‌ పట్టుదల:

లబుషేన్‌కి తోడు హెడ్‌ (42 నాటౌట్‌) కూడా రాణించడంతో ఆసీస్‌ కోలుకుంది. కానీ లబుషేన్‌, వేడ్‌ (1)లను స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేసిన లీచ్‌.. మళ్లీ ఇంగ్లాండ్‌కు ఆశలు కల్పించాడు. అయితే హెడ్‌ పట్టుదల ప్రదర్శించడంతో ఆసీస్‌ కోలుకుంది. కెప్టెన్ టీమ్ పైన్‌ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా.. కమిన్స్ వికెట్ కాపాడుకున్నాడు. దీంతో మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతూ చివరకు డ్రాగా ముగిసింది.

181 పరుగులకే విండీస్‌ ఆలౌట్‌.. పట్టుబిగించిన భారత్

స్టోక్స్‌ సెంచరీ:

స్టోక్స్‌ సెంచరీ:

అంతకుముందు 96/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. 258/5 వద్ద డిక్లేర్‌ చేసింది. వరల్డ్‌కప్ ఫామ్ చూపిస్తూ స్టోక్స్‌ సెంచరీతో అలరించాడు. బట్లర్‌ (31), బెయిర్‌స్టో (30 నాటౌట్‌)లతో స్టోక్స్‌ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మ్యాచ్‌లో వర్షం వల్ల దాదాపు రెండు రోజుల ఆట రద్దయింది. వర్షం ప్రభావం లేకుంటే మ్యాచ్ ఫలితం వచ్చేదే. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 258 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 250కి ఆలౌటైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టోక్స్‌కు దక్కింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు లీడ్స్‌లో శుక్రవారం ఆరంభమవుతుంది.

Story first published: Monday, August 19, 2019, 10:43 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X