Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

181 పరుగులకే విండీస్‌ ఆలౌట్‌.. పట్టుబిగించిన భారత్

India vs West Indies: Cheteshwar Pujara ton, Ishant Sharama and Umesh Yadhav shine as India dominate on Day 2

అంటిగ్వా: వెస్టిండీస్‌ ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. ప్రస్తుతం టీమిండియా 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి.. వెస్టిండీస్‌ ఎ జట్టును ఆలౌట్ చేస్తే టీమిండియా విజయాన్ని సాధిస్తుంది.

200 పరుగుల ఆధిక్యం:

ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 35 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 84 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (13) మరోసారి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. జట్టు స్కోర్ 22 పరుగులకే మయాంక్‌ ఔట్ అయినా.. కెప్టెన్ అంజిక్య రహానే ఆచితూచి ఆడాడు. మరోవైపు హనుమ విహారి మాత్రం బ్యాట్ జులిపించాడు. ప్రస్తుతం రహానే (20), విహారి (48) క్రీజులో ఉన్నారు. టీమిండియా 200 పరుగుల ఆధిక్యంలో ఉంది.

181 పరుగులకే ఆలౌట్‌:

181 పరుగులకే ఆలౌట్‌:

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 181 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో టీమిండియాకు 116 పరుగుల ఆధిక్యం లభించింది. కావెం హాడ్జ్‌ (51; 100 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ సాధించగా.. జొనాథన్‌ కార్టర్‌ (26; 35 బంతుల్లో 2X4, 1X6), హామిల్టన్‌ (33; 72 బంతుల్లో 4X4) రాణించారు. భారత సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మ (21/3), ఉమేశ్‌యాదవ్‌ (19/3), కుల్‌దీప్‌ యాదవ్‌ (35/3) చెలరేగడంతో.. టీ విరామానికి ముందు విండీస్‌ 56.1 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.

హోరాహోరీ పోరులో పుణేరి, తలైవాస్‌ మ్యాచ్‌ 'టై'

పుజారా సెంచరీ:

పుజారా సెంచరీ:

ఛతేశ్వర పుజారా (187 బంతుల్లో 100 రిటైర్డ్‌ నాటౌట్‌; 8 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ.. తెలుగు ఆటగాడు హనుమ విహారి (101 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు).. రిషభ్‌ పంత్‌ (53 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్‌ ) రాణించడంతో భారత్‌ తొలి రోజు శనివారం 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. అయితే ఆదివారం ఇదే స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది. ఆఖరి రోజు మంచి ప్రదర్శన చేస్తే టీమిండియా విజయం ఖాయమే.

Story first published: Monday, August 19, 2019, 9:55 [IST]
Other articles published on Aug 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+