న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆట ఇంకా ముగియలేదు: ఇంగ్లాండ్‌కు గీతోపదేశం చేసిన కోచ్

Ashes 2019: ‘Game is not yet over’, says England batting coach Graham Thorpe


హైదరాబాద్: "ఆట ఇంకా ముగియలేదు" లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టు అనంతరం ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ చేసిన వ్యాఖ్యలివి. యాషెస్ సిరిస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 179 పరుగులకే ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లు మాత్రమే ఆడి 67 పరుగులకే చాపచుట్టేసింది.

<strong>రసవత్తరంగా యాషెస్ మూడో టెస్టు: ఇంగ్లాండ్ 67 ఆలౌట్</strong>రసవత్తరంగా యాషెస్ మూడో టెస్టు: ఇంగ్లాండ్ 67 ఆలౌట్

ఈ నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాహమ్‌ థోర్ప్‌ మాట్లాడుతూ "ఆట ఇంకా ముగియలేదు. గేమ్‌ అప్పుడే ఆసీస్‌ చేతుల్లోకి వెళ్లిపోయిందనే భయాన్ని వీడండి. మూడో రోజు ఆటలో ఆసీస్‌ను కట్టడి చేస్తే మనదే పైచేయి అవుతుంది. గతంలో ఇక్కడ మూడొందల టార్గెట్‌ను ఛేదించిన సందర్భాలున్నాయనే విషయాన్ని మరవకండి. నమ్మకమే గెలుపు. ఆత్మవిశ్వాసంతో పోరాడండి" అని అన్నాడు.

ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 283 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో లబుషేన్‌(53), జేమ్స్‌ పాటినసన్‌(2) పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్ చెరో రెండు వికెట్లు తీయగా... క్రిస్ వోక్స్, లీచ్ చెరో వికెట్ తీసుకున్నారు.

తెల్లవారుజామున 2 గంటల సమయంలో క్రికెట‌ర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్ర‌మాదం

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. 1948 తర్వాత ఈ మైదానంలో ఇంగ్లాండ్ అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. యాషెస్ టెస్టు సిరిస్‌లో ఈ వేదికలో నమోదైన అత్యల్ప స్కోరు కూడా ఇదే. 1909లో ఇంగ్లాండ్ సాధించిన 87 పరుగులే ఈ స్టేడియంలో ఇప్పటివరకు అత్యల్పం కాగా, నేటి మ్యాచ్‌లో ఆ రికార్టు కనుమరుగైంది.

Story first published: Saturday, August 24, 2019, 13:18 [IST]
Other articles published on Aug 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X