For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తెల్లవారుజామున 2 గంటల సమయంలో క్రికెట‌ర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్ర‌మాదం

క్రికెట‌ర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్ర‌మాదం ! || Oneindia Telugu
Kochi: Fire breaks out at cricketer Sreesanth’s house, no injuries reported

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొచ్చిలోని ఎడపల్లీలో ఉన్న క్రికెట‌ర్ శ్రీశాంత్ ఇంట్లో శనివారం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌ సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో గ్రౌండ్ ప్లోర్ పూర్తిగా పూర్తిగా ద‌గ్ధ‌మైంది.

గ్రౌండ్ ప్లోర్‌లోనే హాలు, బెడ్ రూమ్ ఉన్నాయి. అయితే, ఈ ప్ర‌మాదం వ‌ల్ల ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అగ్ని ప్రమాదం చోటుకున్న సమయంలో శ్రీశాంత్ మాత్రం ఇంట్లో లేడు. మంట‌లు వ్యాపించిన స‌మ‌యంలో ఇంట్లో శ్రీశాంత్ భార్య‌, పిల్ల‌లతో పాటు ఇద్దరు పని మనుషులు ఉన్నారు.

వెంటనే వారు ఫైర్ ఫైటర్స్‌కు సమాచారం అందించి... ఫస్ట్ ప్లోర్‌కు వెళ్లారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ ఫస్ట్ ప్లోర్‌లోని గ్లాస్ డోర్స్‌ను బద్దలు కొట్టి మరీ వారికి కాపాడారు. శ్రీశాంత్ ఇంట్లో పొగలు రావడం చూసిన చుట్టుపక్కవాళ్లు వెంటనే స్థానిక ఫైర్ స్టేషన్స్‌కు సమాచారమిచ్చారు.

కాగా, ఇటీవలే క్రికెట‌ర్ శ్రీశాంత్‌పై ఉన్న నిషేధ కాలాన్ని బీసీసీఐ త‌గ్గించిన సంగతి తెలిసిందే. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అంబుడ్స్‌మెన్ ఇచ్చిన ఆదేశాల‌తో శ్రీశాంత్ మ‌ళ్లీ 2020లో క్రికెట్ ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.

Story first published: Saturday, August 24, 2019, 16:57 [IST]
Other articles published on Aug 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+