న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ.. స్మిత్ అరుదైన రికార్డు

Ashes 2019, England vs Australia 1st Test: Steve Smith becomes second-fastest batsman to score 25 test Centuries

ర్మింగ్‌హామ్‌: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ అరుదైన రికార్డు సాధించాడు. యాషెస్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఐదో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సహచరులు పెవిలియన్ చేరినా ఒంటరి పోరాటం చేసి సెంచరీ (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించిన స్మిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సూపర్ సెంచరీ (142; 207 బంతుల్లో 14×4) సాధించాడు. దీంతో 2003లో మాథ్యూ హేడెన్‌ తర్వాత యాషెస్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా స్మిత్ నిలిచాడు.

టీ20ల్లో రోహిత్‌ మరో ఘనత.. కోహ్లీ రికార్డు బద్దలు

గతంలో బార్డ్‌స్లే, మోరిస్, స్టీవ్‌ వాలు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశారు. తాజాగా స్మిత్ వీరి సరసన చేరాడు. టెస్టుల్లో స్మిత్‌ 25 సెంచరీలు సాధించాడు. యాషెస్‌లో మాత్రం ఇది పదో సెంచరీ. మరోవైపు వేగంగా 25 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా స్టీవ్‌ (119 ఇన్నింగ్స్‌) నిలిచాడు. ఆసీస్ మాజీ దిగ్గజం బ్రాడ్‌మన్‌ (66 ఇన్నింగ్స్‌) ముందున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 130 ఇన్నింగ్స్‌లలో 25 సెంచరీలు సాధించాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 124/3తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియాను స్మిత్‌ ముందుండి నడిపించాడు. ట్రావిస్‌ హెడ్‌ (51)తో కలిసి నాలుగో వికెట్‌కు 130 పరుగులు, వేడ్‌తో కలిసి స్మిత్‌ ఐదో వికెట్‌కు 126 పరుగులు జత చేశాడు. సెంచరీ అనంతరం వోక్స్‌ బౌలింగ్‌లోపెవిలియన్ చేరాడు. చివరలో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ చెలరేగడంతో 487 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్‌ ముందు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

విరామ సమయం.. ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్ ఆడిన ధోనీ (వీడియో)

అనంతరం ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్‌ (7), రాయ్‌ (6) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్‌ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి. ప్రస్తుత పరిస్థితులలో ఇంగ్లండ్‌కు డ్రా చేసుకోవడమే సరైన దారి. ఎందుకంటే ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు ఛేదించడమే కష్టమే. మొదటి సెషన్లో ఇంగ్లండ్‌ నిలవగలిగితే గట్టెక్కినట్టే.

Story first published: Monday, August 5, 2019, 13:00 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X