న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరామ సమయం.. ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్ ఆడిన ధోనీ (వీడియో)

MS Dhoni Spotted Playing Volleyball With His Territorial Army Battalion || Oneindia Telugu
Lieutenant Colonel MS Dhoni plays volleyball with his Territorial Army battalion

ఢిల్లీ: లెజెండరీ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్నాడు. భారత ఆర్మీలో పనిచేయాలనే కోరికతో క్రికెట్‌కు రెండు నెలల పాటు విశ్రాంతిని ఇచ్చి శుక్రవారం దక్షిణ కశ్మీర్‌లోని పారా రెజిమెంట్‌ విభాగంలో విధులు ప్రారంభించాడు. మహీ ఆగస్టు 15 వరకు అక్కడే సైనిక విధుల్లో పాల్గొననున్నాడు.

<strong>టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ</strong>టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ

ఆర్మీ సిబ్బందితో వాలీబాల్‌:

ఆర్మీ సిబ్బందితో వాలీబాల్‌:

ధోనీ ఒకవైపు కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు విరామ సమయంలో అక్కడి ఆర్మీ సిబ్బందితో వాలీబాల్‌ ఆడాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోను మహీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ధోనీ ప్రస్తుతం తన యూనిట్‌తో కలిసి గార్డు, పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. ధోనీ ఆర్మీలో పనిచేయడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఆందోళన అనవసరం:

కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ధోనీ భద్రతపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పందించారు. రావత్‌ మాట్లాడుతూ... 'ధోనీ భద్రతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత పౌరుడు ఆర్మీ దుస్తులు ధరిస్తే.. ఆ దుస్తులకు తగిన బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలి. ధోనీ విధులు ప్రారంభించాడు. అతనికి ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేస్తాడనే నమ్మకం ఉంది' అని రావత్‌ పేర్కొన్నాడు.

బెంగళూరులో శిక్షణ:

బెంగళూరులో శిక్షణ:

ఆర్మీలో పనిచేయడానికి తనను అనుమతించాలని ధోనీ గత నెలలో ఆర్మీ చీఫ్‌ను కోరారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం నుండి అతనికి అనుమతి లభించింది. దీంతో విండీస్ పర్యటనకు అందుబాటులో ఉండడనని మహీ.. బీసీసీఐకి తెలిపాడు. ఇక విధులలో చేరేముందు శిక్షణ కోసం బెంగళూరు వెళ్ళాడు. శిక్షణ అనంతరం ధోనీ గత బుధవారం శ్రీనగర్ చేరుకుని నేరుగా దక్షిణ కాశ్మీర్‌లోని విక్టర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ విక్టర్ ఫోర్స్‌తో తన విధులను నిర్వర్తిస్తున్నాడు. అయితే ధోనీ ఎటువంటి ఆపరేషన్లో భాగం కాదు.

సిరీస్ గెలిచాం.. తదుపరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం: కోహ్లీ

విండీస్ పర్యటనకు దూరం:

విండీస్ పర్యటనకు దూరం:

ప్రపంచకప్‌లో నెమ్మదైన ఆటపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ధోనీ క్రికెట్‌ నుంచి రిటైరవుతాడని వార్తలు వచ్చాయి. వచ్చే టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగాలని ధోనీ నిర్ణయించుకున్నాడని సమాచారం. విండీస్ పర్యటన నుండి ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే ఇప్పటికి ఆడిన రెండు మ్యాచుల్లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు.

Story first published: Monday, August 5, 2019, 11:38 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X