న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లీషు అభిమానులపై ఆసీస్ ప్రధాని మండిపాటు

Ashes 2019: Australia PM blasts English fans for booing injured Steve Smith

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో ఇంగ్లీషు అభిమానుులు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌ స్మిత్‌ను చీటర్ అంటూ ఎగతాళి చేయడంపై ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తీవ్రంగా మండిపడ్డారు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకింది.

ఆర్చర్‌ను ట్విట్టర్‌లో విమర్శించిన అక్తర్... యువరాజ్ ధీటైన జవాబు

దీంతో స్టీవ్ స్మిత్ మైదానంలో కుప్పకూలాడు. దీంతో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా కంగారుపడ్డారు. అనంతరం ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే, స్టీవ్ స్మీత్ క్రీజులోకి వస్తున్న సమయంలో ఇంగ్లిష్‌ అభిమానులు గేలి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక క్రికెటర్‌క మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు.

PKL 2019: యు ముంబా విజయాలకు హర్యానా స్టీలెర్స్ బ్రేకులు వేసేనా?

"రెండో టెస్టు డ్రాగా ముగిసింది. స్టీవ్ స్మిత్‌ను లార్డ్స్‌లో గేలి చేయడం మొత్తం యాషెస్ ఫౌల్‌గా కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన తర్వాత అతడి ప్రదర్శన అద్భుతం. యుకే గౌరవం తప్ప మరేమీ కోరుకోదు. ఒక చాంపియన్‌ క్రికెటర్‌కు ఇదేనా మీరిచ్చే గౌరవం. అతను నిజమైన చాంపియన్‌. విమర్శకులకు స్మిత్‌ బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. మీరు ఎంతలా హేళన చేస్తే అంతకు మించి అతని బ్యాటే జవాబిస్తుంది. స్మిత్‌.. నువ్వు బ్యాట్‌తో మరింత రాణించి యాషెస్‌ ట్రోఫీని ఆస్ట్రేలియాకు తీసుకువస్తావని ఆశిస్తున్నా" అని మారిసన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు.

అంతకముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు సైతం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రేక్షకుల చేష్టలపై మండపడిన సంగతి తెలిసిందే. మరోవైపు బార్మీ ఆర్మీ(ఇంగ్లాండ్ సపోర్టింగ్ గ్రూపు) మాత్రం లార్డ్స్‌లో స్టీవ్ స్మిత్‌ను ఎగతాళి చేసిన అభిమానుల్లో బార్మీ ఆర్మీ లేదని అధికారిక ప్రకటన చేసింది. కాగా, గతేడాది బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌ ద్వారా తన టెస్టు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.

Story first published: Monday, August 19, 2019, 19:01 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X