న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్చర్‌ను ట్విట్టర్‌లో విమర్శించిన అక్తర్... యువరాజ్ ధీటైన జవాబు

Yuvraj Singh’s Hilarious Reply To Shoaib Akhtar’s Tweet || Oneindia Telugu
 Yuvraj Singh offers cheeky response to Shoaib Akhtars criticism of Jofra Archer

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ ట్వీట్‌పై తనదైన శైలిలో ట్విట్టర్‌లో బదులిచ్చాడు టీమిండియా మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్. ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకింది.

56 బంతుల్లో సెంచరీ: 28 ఏళ్ల వరకూ చెక్కు చెదరని రికార్డు

దీంతో స్టీవ్ స్మిత్ మైదానంలో కుప్పకూలాడు. దీంతో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా కంగారుపడ్డారు. అనంతరం ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

అనతంరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే స్టీవ్ స్మిత్‌ గాయపడిన సమయంలో జోఫ్రా ఆర్చర్‌ ప్రవర్తించిన తీరుపై పాక్ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ ట్విటర్‌‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

"క్రికెట్‌లో బౌన్సర్‌లు అనేవి సాధారణం. అయితే, బౌన్సర్ తగిలి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ గాయంతో బాధపడుతున్నప్పడు బౌలర్‌గా అతడి దగ్గరికి వెళ్లి మాట్లాడి, అతడి పరిస్థితి తెలుసుకోవడం కనీస మర్యాద. ఆర్చర్‌ అలా చేయలేదు. తొటి ​​ఆటగాడు గాయంతో బాధపడుతుంటే ప్రవర్తించే తీరు ఇదేనా? నేనైతే అలా చేసేవాడిని కాదు. నా బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్‌ గాయపడితే అందరికంటే ముందే అతడి దగ్గరికి చేరుకొని.. గాయం గురించి వాకబు చేసేవాడిని" అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

PKL 2019: యు ముంబా విజయాలకు హర్యానా స్టీలెర్స్ బ్రేకులు వేసేనా?

అక్తర్‌ ట్వీట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. "అవును నువ్వు కూడా చేశావ్! నీ అసలైన మాటలు నిజాయితీని కూడి ఉన్నాయి. అయితే, మరికొన్ని వస్తున్నాయి" అంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు. కాగా, గాయం కారణంగా యాషెస్‌ రెండో టెస్టు చివరి రోజు ఆటకు స్మిత్‌ దూరమైన సంగతి తెలిసిందే.

Story first published: Monday, August 19, 2019, 18:23 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X