Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2019: యు ముంబా విజయాలకు హర్యానా స్టీలెర్స్ బ్రేకులు వేసేనా?

 PKL 2019: Haryana Steelers look to bounce back against U Mumba

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో యు ముంబా మరో విజయంపై కన్నేసింది. లీగ్‌లో భాగంగా సోమవారం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో హర్యానా స్టీలెర్స్ జట్టుతో తలపడనుంది. గత మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించిన యు ముంబా నేటి మ్యాచ్‌లో సైతం అదే జోరుని కొనసాగించాలని చూస్తోంది.

పట్నా పైరెట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యు ముంబా ఆటగాళ్లు అతుల్ ఎమ్ఎస్, రోహిత్ బలియాన్ కీలక సమయంలో రైడ్ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖరి నిమిషంలో రోహిత్ బలియాన్ సూపర్ రైడ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే పూర్తిగా మారివేశాడు.

హర్యానా స్టీలెర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో వీరిద్దరూ మరోసారి మెరిస్తే విజయం యు ముంబాదే. ఇక, అర్జున్ దేశాయ్ సైతం నేటి మ్యాచ్‌లో సత్తా చాటిదే ఇక తిరుగుండదు. యు ముంబా డిఫెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్ధి జట్టు రైడర్లను తమ ఢిపెన్స్‌తో ఇట్టే కట్టిపడేస్తారు.

యు ముంబా:
ఆడినవి: 8
గెలిచినవి:4
టై: 0
ఓడనవి: 4
విన్ రేట్: 50%
బెస్ట్ రైడర్: అభిషేక్ సింగ్
బెస్ట్ డిఫెండర్: సురీందర్ సింగ్

మరోవైపు హర్యానా స్టీలెర్స్ గత మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చేతిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా మూడు ఆటల్లో విజయం సాధించిన హర్యానా స్టీలెర్స్... తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బోల్తా పడ్డారు. యు ముంబాతో జరిగే పోరులో విజయం సాధించాలంటే హర్యానా డిఫెండర్లు చెమటోడ్చాల్సిందే.

టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కెప్టెన్ ధర్మరాజ్‌తో సహా సునీల్, రవి కుమార్, వికాస్ కాలే అందరూ కలిసి కేవలం రెండు ట్యాకిల్ పాయింట్లే సాధించడం జట్టు ఓటమికి కారణమైంది. తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేసిన వికాస్ ఖండోలాకు తోడుగా హర్యానా స్టీలెర్స్ సమిష్టి ప్రదర్శన చేస్తేనే విజయం సాధిస్తుంది.

హర్యానా స్టీలెర్స్:
ఆడినవి: 8
గెలిచినవి: 4
టై: 0
ఓడనవి: 4
విన్ రేట్: 50%
బెస్ట్ రైడర్: వికాస్ కంఢోలా
బెస్ట్ డిఫెండర్: సునీల్

Story first published: Monday, August 19, 2019, 16:27 [IST]
Other articles published on Aug 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+