న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 మీటర్లు సిక్స్ కొట్టి.. 140 ప్లస్ స్పీడ్‌తో బంతులేస్తే డ్రగ్స్ తీసుకున్నానని నిందలేసారు: ఆండ్రీ రస్సెల్

Andre Russell says hit ball 100 meters, bowled 140 plus, people questioned if I was using drugs
IPL 2021 : Andre Russell Darkest Phase Of Career డ్రగ్స్‌ తీసుకున్నా అన్నారు || Oneindia Telugu

అహ్మదాబాద్: 100 మీటర్లు సిక్స్‌ను అలవోకగా కొట్టి.. 140 ప్లస్ స్పీడ్‌తో బంతులేస్తే తాను డ్రగ్స్ తీసుకున్నానని నిందలేసారని కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ అన్నాడు. తన కెరీర్‌ మంచి పీక్‌లో ఉన్నప్పుడు తగిలిన ఎదురుదెబ్బలను ఈ విండీస్ వీరుడు గుర్తుచేసుకున్నాడు. డ్రగ్స్ తీసుకున్నానని ప్రజలు ప్రశ్నించడం తన జీబితంలోనే చేదు జ్ఞాపకమని ఆవేదన వ్యక్తం చేశాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ తాజాగా విడుదల చేసిన వీడియోలో రస్సెల్ తన జీవితంలోనే చీకటి రోజులను నెమరువేసుకున్నాడు. 2017లో డ్రగ్స్‌ ఆరోపణల నేపథ్యంలో రస్సెల్ నిషేధానికి గురయ్యాడు. ఆ విషయాన్ని తలచుకున్న ఈ కేకేఆర్ హిట్టర్.. ఇది దుష్ట ప్రపంచమని ఆవేదన వ్యక్తం చేశాడు.

అత్యంత చెత్త ఏడాది..

అత్యంత చెత్త ఏడాది..

'నా జీవితంలోనే 2017 అత్యంత చెత్త ఏడాది. నా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నాపై నిషేధం పడిందనే విషయం మీకు తెలిసిందే. నేను బంతిని క్లీన్‌గా హిట్‌చేసేవాడిని. నా ఆటను చూసి ప్రజలంతా నాపై అనుమానం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు. కానీ నేను ఏదీ దాచాలనుకో లేదు. అన్నీ టెస్టులు చేయించుకున్న తర్వాతే క్రికెట్‌ ఆడేవాడిని. నేను 100 మీటర్ల దాటి సిక్స్‌‌ను సులువుగా కొట్టడం, షార్ట్‌ రన్‌తో 140 కిలో మీటర్ల కంటే వేగంగా బౌలింగ్‌ చేయడంతో ప్రజలంతా నేను డ్రగ్స్‌ తీసుకున్నాని అనుమానం వ్యక్తం చేశారు.

నన్ను ప్రశ్నించడం కూడా మొదలు పెట్టారు. ఇక్కడ నేను చూపించుకోవడానికి ఏమీ లేదు. కానీ ఎలా బయటపడాలో తెలుసు. రెండేళ్ల పాటు కోర్టు విచారణ జరిగింది.

ఇదో దుష్ట ప్రపంచం..

ఇదో దుష్ట ప్రపంచం..

ఆ సమయంలో నన్ను గట్టిగా కొట్టారు. అది నన్ను చాలా బాధించింది. ఇతర ప్రజలు, ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. తొలిసారి కలిసిన వ్యక్తులు కూడా నాపై అసత్య ఆరోపణలు చేశారు. ఇదో దుష్ట ప్రపంచం. ఏదో రకంగా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారనిపించింది. అప్పుడు ఎవరో ఒకరు తీసుకొచ్చిన బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పాను.. నేను ఏ తప్పు చేయలేదని బైబిల్‌పై ప్రమాణం చేశా. మహిళలు కానీ పురుషులు కానీ ఎవరూ కూడా బైబిల్‌పై ప్రమాణం చేసి అబద్ధం చెప్పరు. నాకు బైబిల్‌ అంటే చాలా గౌరవం.

 బయట తిరగలేకపోయా..

బయట తిరగలేకపోయా..

ఒకామే నా కళ్లలోకి చూస్తూ.. నాతో జమైకా యాంటి డోపింగ్ కమిషన్ నిబంధనలు, విధివిధానాలను చర్చించానని చెప్పింది. ఆ మాటలతో తీవ్ర ఆవేదనకు గురైన నేను కోర్టులో సహనం కోల్పోయి అరిచాను. ఆమెను నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. నేను అబద్దం చెప్పడం లేదు. నిజంగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదని గట్టి అరిచా. ఆ నిషేధ సమయంలో తీవ్ర మనోవేదను అనుభవించాను. కనీసం క్రికెట్ మ్యాచ్‌లు కూడా చూడలేకపోయాను. మా సిటీ ధాటలేకపోయాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా వీడు డ్రగ్స్ తీసుకుంటాడన్నట్లు చూశారు. ఎందుకంటే వారికి నిజం తెలియదు. మ్యాచ్‌లు ఆడలేకపోయాను. కేకేఆర్ మ్యాచ్‌లు కొని చూస్తూ స్కోర్లు తెలుసుకునేవాడిని'అని తన చీకటి రోజులను రస్సెల్ గుర్తు చేసుకున్నాడు.

 చితక్కొట్టిన రస్సెల్..

చితక్కొట్టిన రస్సెల్..

నిషేధం తర్వాత 2018లో ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రస్సెల్ తన ఉగ్రరూపం చూపించాడు. ఆ సీజన్‌లో 184.80 స్ట్రైక్‌రేట్‌తో 316 పరుగులు చేశాడు. ఇక 2019లోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 204. 82 స్ట్రైక్‌రేట్, 56.67 యావరేజ్‌తో 510 రన్స్ చేశాడు. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన సీజన్‌లో విఫలమైనా.. తాజా సీజన్‌లో మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. 7 మ్యాచ్‌ల్లో 155.23 స్ట్రైక్‌రేట్ 163 రన్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ ఆడిన ఇన్నింగ్స్ ఈ సీజన్‌కే హైలైట్.

Story first published: Saturday, May 1, 2021, 22:59 [IST]
Other articles published on May 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X