ఆరోజు కోహ్లీ నా జీన్స్ వైపు చూడలేదు: అర్చన విజయ వివరణ

Posted By:

హైదరాబాద్: గత నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అలా తదేకంగా టీవీ కామెంటేటర్ అర్చన విజయ వేసుకున్న జీన్స్‌ను చూస్తున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోటోపై కామేంటేటర్ అర్చన విజయ స్పందించింది.

కోహ్లీ ఆ రోజు తాను ధ‌రించిన రిప్డ్ జీన్స్ వైపు చూడ‌డం లేద‌ని చెప్పింది. కోహ్లీ త‌న చేతిలో ఉన్న క్యూ కార్డ్‌వైపు చూస్తున్నాడ‌ని అస‌లు అర్చన అసలు విషయాన్ని చెప్పింది. 'అప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడుతున్నాం. పాపం.. కోహ్లీ ఆన్స‌ర్స్ కోసం క్యూ కార్డ్‌లోకి చూస్తున్నాడంతే' అని అర్చ‌న ఆ స‌న్నివేశాన్ని వివరించింది.

Anchor Archana Vijaya clarifies virat kohli stares image

గత నెలలో ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి అయిన విరాట్‌ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ కామెంటేటర్ అర్చన విజయ బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేస్తున్న చోటుకు వెళ్లింది. కోహ్లీని అర్చ‌న ఇంట‌ర్వ్యూ చేస్తున్న సంద‌ర్భంగా తీసిన ఫొటో ఒక‌టి వైర‌ల్ అయింది.

ఆ ఫొటోలో కోహ్లీ చిరిగినట్లు ఉండే ఆమె జీన్స్‌ను త‌దేకంగా చూస్తున్న‌ట్లు ఉంది. కోహ్లీ అలా తదేకంగా ఆమె వేసుకున్న జీన్స్‌ను చూస్తున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Story first published: Wednesday, May 3, 2017, 21:42 [IST]
Other articles published on May 3, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి