న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సందేహమే లేదు.. అతను టీమిండియా కెప్టెన్ అవుతాడు!! కోహ్లీ, రోహిత్‌కి పోటీ!!

Alex Carey said No doubt, Shreyas Iyer to lead Team India in future
Alex Carey - 'No Doubt, Shreyas Iyer To Lead Team India In Future'

సిడ్నీ: భారత క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు వారికి పోటీనే లేకుండా పోయింది. అంతలా ప్రభావం చూపారు ఇద్దరు. ధోనీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో పగ్గాలు అందుకున్నాడు. విరాట్ అద్భుతంగా రాణిస్తున్నా.. రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సారథ్యం అప్పగించాలని మాజీలు సూచిస్తున్నారు. ఇక ఐపీఎల్ పుణ్యమాని ఇపుడు మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా కెప్టెన్‌ రేసులోకి వచ్చాడు.

అలెక్స్ క్యారీ జోస్యం:

అలెక్స్ క్యారీ జోస్యం:

మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గత రెండేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఐపీఎల్‌లో నిరూపించుకున్నాడు. 2019 సీజన్‌లో ఢిల్లీ టీమ్‌ని కెప్టెన్‌గా ప్లేఆఫ్‌కి చేర్చిన అయ్యర్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఏకంగా ఫైనల్‌కి చేర్చాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి. దాంతో అయ్యర్ కెప్టెన్సీని మాజీ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. ఇక ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఓ అడుగుముందుకేసి టీమిండియాకి భవిష్యత్‌లో అయ్యర్ కెప్టెన్ అవుతాడంటూ జోస్యం చెప్పాడు. క్యారీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.

టీమిండియాని నడిపిస్తాడు:

టీమిండియాని నడిపిస్తాడు:

మంగళవారం అలెక్స్ క్యారీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించాడు. 'సందేహమే లేదు.. టీమిండియాని ఏదో ఒక రోజు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నడిపిస్తాడు. ఆ సామర్థ్యం అతనికి ఉంది. అతను అద్భతమైన లీడర్. రాబోవు రోజుల్లో మరింత మెరుగవుతాడు. జట్టు‌లోని ఆటగాళ్లను అయ్యర్‌ చక్కగా సమన్వయం చేస్తాడు. ఈ విషయం గత రెండు ఐపీఎల్ సీజన్లలో స్పష్టమైంది' అని క్యారీ చెప్పుకొచ్చాడు. క్యారీ ఆసీస్ తరఫున 39 వన్డేలు, 30 టీ20లు ఆడాడు. మూడు ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. అది కూడా ఈ ఏడాదే.

అయ్యర్‌ ఇంకా చిన్నవాడు:

అయ్యర్‌ ఇంకా చిన్నవాడు:

'శ్రేయాస్ అయ్యర్‌ ఇంకా చిన్నవాడు. చాలా నేర్చుకుంటున్నాడు. అతను అద్భుతమైన బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు గొప్ప వ్యక్తి. ఢిల్లీ క్యాపిటల్స్ వంటి పెద్ద జట్టులోని ప్రతి ఆటగాడితో కనెక్ట్ అవ్వడం చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ అతను దానిని సులువుగా చేస్తున్నాడు. ఆట పట్ల అతనికి ఉన్న సానుకూల వైఖరే దీనికి కారణం. రికీతో అతని ఆలోచనలు పంచుకోవడం నిజంగా మాకు ప్లస్ అయింది. అయ్యర్‌కు మంచి భవిష్యత్తు ఉంది' అని అలెక్స్ క్యారీ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఈ ఏడాది ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌లాడిన క్యారీ 32 పరుగులు చేశాడు.

13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి:

13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి:

ఐపీఎల్ మొదటి నుంచి ఆడుతున్న ఢిల్లీ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. అయితే ఎప్పుడైతే శ్రేయాస్ అయ్యర్ పగ్గాలు చేపట్టాడో ఢిల్లీ తలరాత పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ టీమ్‌ని కెప్టెన్‌గా ప్లేఆఫ్‌కి చేర్చిన అయ్యర్.. ఐపీఎల్ 2020‌లో ఏకంగా ఫైనల్‌కి చేర్చాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి. 2012 తర్వాత గత ఏడాది ఢిల్లీ‌ని ప్లేఆఫ్‌కి చేర్చిన ఘనత కూడా అయ్యర్‌కే దక్కింది. మొత్తంగా అయ్యర్ సారథ్యంకు మంచి మార్కులే పడ్డాయి. ఆస్ట్రేలియాతో నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుండగా.. వన్డే, టీ20 జట్టులోకి అయ్యర్ ఎంపికయ్యాడు.

India vs Australia: టెస్టు సిరీస్‌లో ఆడే హక్కు సంపాదించా: యువ సంచలనం

Story first published: Tuesday, November 17, 2020, 20:38 [IST]
Other articles published on Nov 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X