
టెస్టు జట్టులో ఆడే హక్కుని సంపాదించా:
ఆస్ట్రేలియా తరఫున 2019లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు విల్ పకోస్కీ తొలిసారి ఎంపికయ్యాడు. కానీ మానసిక సమస్యలతో సిరీస్ నుంచి వైదొలిగాడు. అయితే ఈ సారి మాత్రం ఆడటానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. 'టెస్టు జట్టులో ఆడే హక్కుని సంపాదించానని భావిస్తున్నా. నాకు అవకాశం లభిస్తే.. టీమిండియా ఇచ్చే సవాళ్లను ఎదుర్కొంటా. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే.. ఇప్పుడు ఎంతో ఉత్తమంగా ఉన్నా. 15-20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాను. క్రికెట్ పరంగా, వ్యక్తిగతంగా మంచి స్థానంలో ఉండేందుకు శ్రమించా' అని పకోస్కీ తెలిపాడు.

బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నా:
'గతంలో ఆస్ట్రేలియా జట్టు నుంచి పిలుపు వచ్చినప్పుడు ఉత్సాహంగా అనిపించింది. కానీ ఇప్పుడు సంతోషంతో పాటు బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాను' అని పకోస్కీ పేర్కొన్నాడు. పకోస్కీ గొప్పగా రాణిస్తాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో విక్టోరియా జట్టు పకోవ్‌స్కీని ఓపెనర్‌గా ప్రమోట్ చేయగా.. మూడు ఇన్నింగ్స్‌ల్లోనే 495 రన్స్ చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. విక్టోరియాకు చెందిన పకోవ్‌స్కీ ఓవరాల్‌గా 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 55.48 సగటుతో 1720 పరుగులు సాధించాడు.

ఓపెనర్‌గా పకోస్కీ:
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు పకోస్కీ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. పకోవ్‌స్కీని టెస్ట్ తుది జట్టులోకి తీసుకునే ముందు క్రికెట్ ఆస్ట్రేలియా.. వార్నర్‌ను సంప్రదించనుంది. వార్నర్ ఓకే చెబితేనే పకోవ్‌స్కీకి ఆడే అవకాశం దక్కనుంది. ఎందుకంటే గత కొంత కాలంగా వార్నర్, జో బర్న్స్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. వీరిద్దరూ 27 ఇన్నింగ్స్‌ల్లో 50.55 యావరేజ్‌తో పరుగులు చేశారు. పకోవ్‌స్కీని ఆడించాలంటే జోను పక్కనబెట్టాల్సి ఉంటుంది. దీంతో ఓపెనింగ్ జోడి మార్పు విషయమై మేనేజ్‌మెంట్ వార్నర్‌ను సంప్రదించనుంది.

ఆస్ట్రేలియా టీమ్:
టిమ్ పైన్ (కెప్టెన్), సీన్ అబాట్, జో బర్న్స్, పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మైఖేల్ నీజర్, జేమ్స్ పాటిన్సన్, విల్ పుకోస్కీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్.


Click it and Unblock the Notifications

వెబ్ సిరీస్‌లో నటించనున్న భారత టెన్నిస్ స్టార్!!










