న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్వేం క్రికెటర్‌రా అయ్యా? .. ఇంత దారుణమా? (వీడియో)

Akif Javed makes horrible fielding error to gift a boundary to Imad Wasim in PSL 2020

కరాచీ: కరోనా దెబ్బకు ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. ఇప్పటికే భారత్-దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లు రద్దయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ వాయిదా పడింది. క్రికెటేతర టోర్నీలు కూడా జరగడం లేదు. ఈ మహమ్మారి దెబ్బకు యావత్ క్రీడాలోకమే అతలాకుతలమైంది. కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2020 సీజన్ మాత్రం కొనసాగుతోంది.

ప్రాణాంతక వైరస్ దెబ్బకు వీదేశీ ఆటగాళ్లు వెళ్లినా.. చివరి దశకు చేరడంతో పాకిస్థాన్ బోర్డు ఉన్న ఆటగాళ్లతోనే పీఎస్‌ఎల్‌ను తూతు మంత్రంగా.. అది కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తుంది. అన్ని టోర్నీలు రద్దవ్వడంతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులు.. ఈ నాన్ ప్లే సీజన్‌ను పీఎస్‌ఎల్‌తోనైనా ఆస్వాదిద్దామనుకుంటే అక్కడా వారికి కావాల్సిన మజా దొరకడం లేదు.

వన్డే సిరీస్‌ రద్దైనా భారత్‌లోనే సఫారీ క్రికెటర్లు.. ఎందుకంటే?!!వన్డే సిరీస్‌ రద్దైనా భారత్‌లోనే సఫారీ క్రికెటర్లు.. ఎందుకంటే?!!

అంతర్జాతీయ స్థాయి మ్యాచేనా?

ఆటగాళ్ల తీసికట్టిన ఆట.. పేలవ ఫీల్డింగ్ చూస్తుంటే ఇది అంతర్జాతీయ స్థాయి మ్యాచేనా? అనే సందేహం కలుగుతోంది. మొన్న ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే మరీ దారుణం. ఈ లీగ్‌‌లో విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నా.. పాకిస్థాన్ క్రికెటర్ల ఆట మాత్రం మరీ అధ్వాన్నంగా తయారైంది. సీనియర్, జూనియర్ తేడాలేకుండా చెత్త ప్రదర్శనతో ఆటగాళ్లు అభిమానుల ట్రోలింగ్‌కు గురవుతున్నారు.

ఆ మధ్య సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సునాయస క్యాచ్ జారవిడిచి అభిమానుల ఆగ్రహానికి గురైతే.. తాజాగా అకీఫ్ జావేద్ మిస్ ఫీల్డ్ యావత్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. మరీ దారుణంగా.. క్రికెట్ నేర్చుకునే బుడ్డోడు కూడా అంత అధ్వాన్నంగా చేయడనేలా అతని ఫీల్డింగ్ ఉంది.

కాళ్ల కింది నుంచి..

కాళ్ల కింది నుంచి..

కరాచీ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో రుమ్మన్ రయిస్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతిని వసిమ్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడాడు. అందరూ సింగిల్ వస్తుందని భావించారు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అకిఫ్ జావెద్ నిర్లక్ష్యంగా వ్యవహరించి బంతి అడ్డుకోలేకపోయాడు. ఎంతలా అంటే అతని కాళ్ల సందులో నుంచి బంతి బౌండరీ లైన్ తాకెంత. ఇది చూసిన కామెంటేటర్లకు, సహచర ఆటగాళ్లకు దాదాపు పిచ్చెక్కింది. ఇంత దారుణంగా ఫీల్డింగ్ చేస్తారా? అని ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఫీల్డింగ్ చేశావా? నిద్రపోయావా?

ఫీల్డింగ్ చేశావా? నిద్రపోయావా?

ఈ వీడియోను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా జావెద్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఫీల్డింగ్ చేస్తున్నవా? లేక నిద్రపోయావా? నువ్వేం క్రికెటర్‌రా అయ్యా? .. ఇంత దారుణమా? అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఈ తరహా ఫీల్డింగ్ చిన్నపోరడు కూడా చేయడని మండిపడుతున్నారు. పాక్‌లో నాణ్యమైన క్రికెటర్లు తయారవ్వడం లేదనేందుకు ఇదే నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.

 కరాచీ కింగ్స్ గెలుపు..

కరాచీ కింగ్స్ గెలుపు..

ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. హుస్సెన్ తలత్(37), ఫిల్ సాల్ట్ (25) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. దారుణ ఫీల్డింగ్‌తో ట్రోలింగ్‌‌కు గురైన అకిఫ్ జావేద్ ఒక వికెట్ తీయడం గమనార్హం.

Story first published: Monday, March 16, 2020, 16:08 [IST]
Other articles published on Mar 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X