న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఈ సెంచరీ నాకెంతో ప్రత్యేకం.. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి అంకితం'

IND V WI 2019, 1st Test : Rahane Relieved With 'Special' Hundred At Antigua || Oneindia Telugu
Ajinkya Rahane dedicated his century to people who backed through times

ఆంటిగ్వా: టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే సెంచరీ చేసి దాదాపు రెండేళ్లైంది. చివరకు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదాడు. 17 టెస్టు మ్యాచ్‌ల అనంతరం సెంచరీ నమోదు చేయడంతో రహానే విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యాడు. వెస్టిండీస్‌పై సాధించిన ఈ సెంచరీ చాలా ప్రత్యేకం అని, కష్టకాలంలో తనకు అండగా ఉన్న అందరికీ అంకితం ఇస్తున్నా అని రహానే పేర్కొన్నాడు.

<strong>గంగూలీ రికార్డు బ్రేక్.. ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ</strong>గంగూలీ రికార్డు బ్రేక్.. ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ

ఎంతో ప్రత్యేకం:

ఎంతో ప్రత్యేకం:

మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ... 'నాకు చాలా ఆనందంగా ఉంది. 17 టెస్టు మ్యాచ్‌ల తర్వాత సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. 70 నుంచి 80 పరుగుల మధ్యలో పరుగులు చేస్తున్నా.. రెండేళ్ల నుంచి టెస్టు సెంచరీ లేదు. ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకం. కష్టకాలంలో అండగా ఉన్న అందరికీ అంకితం ఇస్తున్నా' అని రహానే తెలిపాడు. తొలి టెస్టులో రహానే (81; 102) కీలక ఇన్నింగ్సులు ఆడాడు.

ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేయాలనుకున్నాం:

ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేయాలనుకున్నాం:

'20 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో తొలి ఇన్నింగ్స్‌ క్లిష్టంగా మారింది. ఆ సమయంలో కీలక భాగస్వామ్యం కావాలి. రాహుల్‌తో నా మంచి భాగస్వామ్యం వచ్చింది. తొలి రోజు వికెట్‌ తడిగా అనిపించింది. పరుగుల గురించి ఆలోచించకుండా.. ఎక్కువ బంతులు ఆడటంపై దృష్టి పెట్టా. 90-100 ఓవర్లు ఆడితే పరుగులు వస్తాయని అనుకున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో నేను, విరాట్‌ మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాం. అలాగే ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేయాలని నిశ్చయించుకున్నాం' రహానే తెలిపాడు.

విహారితో కలిసి కీలక భాగస్వామ్యం:

విహారితో కలిసి కీలక భాగస్వామ్యం:

ఓవర్‌నైట్‌ స్కోరు 185/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 7 వికెట్లకు 343 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. నాలుగో రోజు ఆటలో రెండో ఓవర్‌లోనే చేజ్‌ బౌలింగ్‌లో కోహ్లీ (51) పెవియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి రహానే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి విండీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. దీంతో లంచ్‌ సమయానికి 287/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. విరామం తర్వాత సెంచరీ పూర్తి చేసిన రహానే.. గాబ్రియెల్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

కెప్టెన్సీ ఓ బాధ్యత.. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నా: కోహ్లీ

 రహానేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:

రహానేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:

రహానే అద్భుతంగా ఆడడంతో తొలి టెస్టులో భారత్‌ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా విండీస్‌ జట్టుపై భారత్‌కిదే అత్యుత్తమ విజయం. 1988 జనవరిలో చెన్నైలో జరిగిన టెస్టులో విండీస్‌పై 255 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును భారత్‌ సవరించింది. రెండు ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడిన రహానే (81, 102) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు శుక్రవారం కింగ్‌స్టన్‌లో జరగనుంది.

Story first published: Monday, August 26, 2019, 15:05 [IST]
Other articles published on Aug 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X