
కెప్టెన్సీ ఓ బాధ్యత:
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'కెప్టెన్సీ అనేది ఓ బాధ్యత. నేను దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నా. జట్టును నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను. జట్టు లేకుండా ఏమీ సాధ్యం కాదు. జట్టులో అందరికి సమన్వయం ఉంది. నేను సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. జట్టులోని ప్రతి ఒక్కరితోనూ వాటిని షేర్ చేసుకుంటా. అందరం కలిసి జట్టుకు ఏది మంచిదో అలాంటి నిర్ణయాలే తీసుకుంటాం' అని కోహ్లీ తెలిపాడు.

బుమ్రా ఎప్పటికీ కీలక ఆటగాడే:
'ఈ మ్యాచ్ గెలుపులో రహానేది కీలక పాత్ర. రహనే రెండు ఇన్నింగ్స్‌లలో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కూడా బాగా ప్రయత్నించాడు. విహారిలో మంచి ఆటగాడున్నాడు. అతని ఆట అమోగం. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల నుంచి బుమ్రా బాగా ఆడుతున్నాడు. బుమ్రా ఎప్పటికీ జట్టులో కీలక ఆటగాడే. షమీ కూడా ప్రపంచకప్ నుంచి అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. తొలి ఇన్సింగ్స్‌లో ఇషాంత్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్: సింధు తల్లి

అందుకే విహారి అవకాశం ఇచ్చాం:
'ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ కూడా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మా బౌలింగ్ బలంగా ఉంది. మ్యాచ్‌లో కాంబినేషన్ ముఖ్యం. అందుకే విహారి అవకాశం ఇచ్చాం. అతను సమర్థవంతమైన పార్ట్‌టైమ్ బౌలర్ కూడా. జట్టు XI గురించి ప్రజలు అందరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి' అని కోహ్లీ చెప్పుకొచ్చారు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా ఈ టెస్టు విజయంతో ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌ను ఘనంగా ఆరంభించింది.


Click it and Unblock the Notifications












