న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే: ఏబీ డివిలియర్స్

 AB De Villiers Points At This Trend Impacting The Game

న్యూఢిల్లీ: బిజీ షెడ్యూల్ క్రికెటర్లకు ఇబ్బందిగా మారిందని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. అంతర్జాతీయంగా క్రికెటర్లకు ఉన్న సమస్య ఇదేనని తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు రావడంతో ఆటగాళ్లు ఫార్మాట్లను ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐపీఎల్‌తో భారత అభిమానులకు అతను మరింత చేరువయ్యాడు. మైదానం నలువైపులా క్రికెటింగ్‌ షాట్లను కొట్టే ఏబీడీని అంతా 'మిస్టర్ 360'గా పిలుస్తారు.

 బిజీ షెడ్యూల్‌తోనే..

బిజీ షెడ్యూల్‌తోనే..

2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీడీ గతేడాది ఫ్రాంచైజీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. క్రికెట్ షెడ్యూలింగ్‌కు సంబంధించి డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతేడాది ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ వన్డేలకు వీడ్కోలు పలకడంపై ఎదురైన ప్రశ్నకు డివిలియర్స్ స్పందించాడు. బిజీ షెడ్యూల్ కారణంగానే స్టోక్స్ వన్డే ఫార్మాట్‌ను వదిలేసాడని పేర్కొన్నాడు. 'మంచి ఫామ్‌లో ఉన్న బెన్‌స్టోక్స్ అలా వన్డే ఫార్మాట్‌ను వదిలేయడానికి కూడా క్రికెట్‌ షెడ్యూలింగ్‌ కారణం అయి ఉంటుంది. విపరీతమైన బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బంది పడతారు.

బోర్డులదే కీలక పాత్ర..

బోర్డులదే కీలక పాత్ర..

అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ సమస్య ఉంది. అయితే క్రికెటర్లను తమ జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడేలా స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత ఆయా క్రికెట్‌ బోర్డులపై ఉంటుంది. అందుకే తొలుత ఆటగాళ్లతో మాట్లాడాలి. ఏం సాధించాలని అనుకుంటున్నారు? వారు ఏ ఫార్మాట్‌కు సరిపోతారు? అనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. మొదట దేశం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత లీగుల్లో ఆడటంపై ఏమాత్రం అభ్యంతరం ఉండదు. అయితే దీనికోసం బోర్డు, ఆటగాళ్లు పరస్పరం చర్చించుకోవాలి.

ఫ్రాంచైజీ లీగ్స్‌తో..

ఫ్రాంచైజీ లీగ్స్‌తో..

విదేశాల్లో జరిగే లీగుల్లో ఆడితే వచ్చే అనుభవం మెగా టోర్నీల్లో సాయపడుతుంది. తనతోపాటు సూర్యకుమార్‌ యాదవ్, డేవాల్డ్‌ బ్రెవిస్‌ వంటి క్రికెటర్లు రాణించారు. అదంతా లీగ్‌లతోనే సాధ్యమైంది. అందుకే మనం ఏం చేయగలమనేదానిపై దృష్టిపెట్టాలి. సదరు ప్లేయర్ ఓ ఫార్మాట్‌లో ఆడేందుకు ఇబ్బంది పడుతుంటే స్ఫూర్తి నింపాలి. అలాగే కొనసాగితే మాత్రం అతనితో చర్చించాల్సిన అవసరం ఉంది. నా కెరీర్‌లో నేను గమనించిన అంశమదే. తరచూ మాట్లాడుతూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు కూడా ఈ విషయంలో మద్దతుగా నిలిచింది'అని ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు.

Story first published: Saturday, January 28, 2023, 20:58 [IST]
Other articles published on Jan 28, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X