న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక నా టెస్ట్‌ కెరీర్‌ ముగిసినట్టే: ఆరోన్ ఫించ్‌

Aaron Finch Says I don’t think it’s realistic to play Test cricket again

డెర్బీ: తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ ముగిసినట్టేనని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. తాను మళ్లీ సంప్రదాయక ఫార్మాట్ ఆడటం అనుమానమేనన్నాడు.
3 వన్డేలు, 3టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న ఫించ్‌... కెరీర్‌ ముగిసేలోగా చివరగా ఒక టెస్టు మ్యాచ్‌ ఆడాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయట పెట్టాడు. భారత్‌ వేదికగా జరిగే 202 వన్డే ప్రపంచకప్‌ తన అంతర్జాతీయ కెరీర్‌కు చివరి సిరీస్‌ అవుతుందని cricket.com.au.కు తెలిపాడు.

'నేనింకా టెస్టులు ఆడే అవకాశం ఉందని అనుకోవట్లేదు. రెడ్ బాల్‌తో ఆడతానని చెప్తే అది అబద్ధమే అవుతుంది. టెస్టు జట్టులో చోటు కోసం ఇప్పట్లో నేను ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడలేను. మరోవైపు యువకులు దూసుకొస్తున్నారు. టాపార్డర్‌లో ఇమిడిపోయే యువకులే అధికంగా వెలుగులోకి వస్తున్నారు'అని ఫించ్‌ చెప్పాడు. 2018 డిసెంబరులో భారత్‌తో మెల్‌బోర్న్‌ టెస్ట్‌ అతనికి చివరిది. అదే ఏడాది అక్టోబరులో పాకిస్థాన్‌పై టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన ఫించ్‌ కెరీర్‌లో కేవలం 5 టెస్ట్‌లే ఆడడం గమనార్హం. ఇక 126 వన్డేల్లో 4882 పరుగులు, 61 టీ20ల్లో 1989 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌ గడ్డపై మంచి రికార్డు ఉన్న ఫించ్.. అక్కడ ఆడటం ఎప్పుడూ ఆస్వాదిస్తానని తెలిపాడు.'ఇంగ్లండ్ గడ్డపై బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ ఆస్వాదిస్తా. ఇక్కడి యార్క్ షైర్ క్లబ్ నుంచే నేను క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించాను. ఇక్కడి మైదానాలు నాకు బాగా అలవాటయ్యాయి. నా సొంతమైదానంలో ఆడుతున్నట్లు అనిపిస్తుంది. చతురస్రాకారంలో ఉండే ఇక్కడి మైదానాలు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ మైదానాల్లో ఆడే షాట్లకు పూర్తి విలువ దక్కుతుంది'అని ఫించ్ పేర్కొన్నాడు.

అప్ కమింగ్ వన్డే సిరీస్‌లో మరో 28 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌పై 1000 రన్స్ పూర్తి చేసుకున్న నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడిగా ఫించ్ గుర్తింపు పొందుతాడు. ఈ టూర్ అనంతరం ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఫించ్ నేరుగా దుబాయ్ రానున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఫించ్‌ను ఆర్సీబీ రూ.4.4 కోట్లకు తీసుకుంది.

CPL 2020: వారెవ్వా వాటే క్యాచ్.. ఇది కదా కావాల్సింది.! (వీడియో)CPL 2020: వారెవ్వా వాటే క్యాచ్.. ఇది కదా కావాల్సింది.! (వీడియో)

Story first published: Friday, August 28, 2020, 12:59 [IST]
Other articles published on Aug 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X