న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ టీమిండియా ఆల్‌రౌండర్‌ను ఇక టెస్ట్‌ల్లో చూడటం కష్టమే: ఆకాశ్ చోప్రా

Aakash Chopra says Hardik Pandya May Not be Seen in Test Cricket For a Long While

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఇకపై టెస్ట్ క్రికెట్‌లో చూడటం కష్టమేనని మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా వంటి దేశాల్లోనే హార్దిక్ అవసరం ఎక్కువగా ఉంటుందని, అలాంటిది ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకే అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. దీన్ని బట్టి చూస్తే.. ఇకపై సుదీర్ఘ ఫార్మాట్లో హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదనిపిస్తోందన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జంబో జట్టుపై చోప్రా విశ్లేషించాడు.

హార్దిక్.. ఇక కష్టమే..

హార్దిక్.. ఇక కష్టమే..

'టెస్టు క్రికెట్‌లో హార్దిక్‌ పాండ్యా అవసరం ఉన్నదే ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా వంటి ఫాస్ట్ పిచ్‌లు కలిగిన దేశాల్లో. అక్కడ అతని మీడియం పేస్‌ సేవలు అవసరమవుతాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అతనికి చోటివ్వలేదంటే ఫర్వాలేదు. కానీ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు సిరీస్‌ జట్టులోనూ అతని పేరు లేదు.

అంటే సమీప భవిష్యత్తులో అతన్ని సుదీర్ఘ ఫార్మాట్లో ఇక చూడలేమోమో. అతనికి బౌలింగే ప్రధాన సమస్యగా మారింది. పాండ్యా పనిభారాన్ని పర్యవేక్షిస్తున్నామని కొన్నాళ్ల క్రితం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం అన్నాడు. ఆ తర్వాత రోజు బౌలింగ్‌ చేయనని హార్దిక్ పాండ్యా కూడా చెప్పాడు. అతను సుదీర్ఘ ఫార్మాట్లో పరిగణనలో లేడనే విషయం ఆ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది' అని ఆకాశ్ చెప్పాడు.

దెబ్బతీసిన గాయం..

దెబ్బతీసిన గాయం..

గతంలో హార్దిక్‌ పాండ్యాకు సెలక్టర్లు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. 2018లో ఇంగ్లండ్‌లో అతను చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వెన్నుముక గాయంతో ఇబ్బంది పడ్డాడు. లండన్‌లో శస్త్రచికిత్స సైతం చేయించుకున్నాడు. ఆ తర్వాతి ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. తిరిగి జట్టులోకి వచ్చినా బౌలింగ్‌ చేయడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌‌లకే పరిమితమైన అతను ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కూడా ఒక్క ఓవర్ బౌలింగ్ చేయలేదు. దాంతో సెలెక్టర్ల హార్దిక్‌ను పక్కనపెట్టారు.

బౌలింగ్‌కు సిద్దంగా లేకపోవడంతో..

బౌలింగ్‌కు సిద్దంగా లేకపోవడంతో..

2019 వరల్డ్ కప్ నుంచి అతను బౌలింగ్ చేసింది కూడా ఏం లేదు. సర్జరీ తర్వాత అతను బౌలింగ్ చేయడానికి సౌకర్యంగా కనిపించలేదు. దాంతో కేవలం బ్యాట్స్‌మన్‌గా ఎంపికచేయడానికి ఇష్టపడని సెలెక్టర్లు సంప్రదాయక ఫార్మాట్‌కు దూరం పెట్టారు. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి కూడా ధృవికరించారు. 'హార్దిక్ పాండ్యా ఇప్పటికీ బౌలింగ్ చేయడానికి సిద్దంగా లేడు.

ఇంగ్లండ్‌తో సిరీస్‌‌కు అతన్ని ఎంపిక చేసి బౌలర్ల వర్క్‌లోడ్ తగ్గించాలనకున్న సెలెక్టర్ల వ్యూహం ఘోరంగా విఫలమైంది. దాంతో అతన్ని టెస్ట్ క్రికెట్‌కు పక్కనపెట్టారు.'అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు.

24 మందితో టీమ్..

24 మందితో టీమ్..

డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌కు చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్‌ కమిటీ 24 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. జూన్‌ 18-22 మధ్య సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ జరుగుతుంది. కాగా, సెలెక్టర్లు జట్టు ఎంపికలో సంచలనాలకు చోటివ్వలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ సీనియర్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు చైనామన్‌ బౌలర్ కుల్దీప్‌ యాదవ్‌పై వేటు పడింది.

Story first published: Monday, May 10, 2021, 14:42 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X