న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్‌కు కీపింగ్.. వృద్దిమాన్ సాహా‌కు బ్యాటింగ్ రాదు: ఆకాశ్ చోప్రా

Aakash Chopra says Atmosphere has been wrongly created that Pant is a bad keeper, and Saha cannot bat

మెల్‌బోర్న్‌: టీమిండియా వికెట్ కీపర్లు రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహాల పరిస్థితి ఒకరికి బ్యాటింగ్ వస్తే మరొకరికి కీపింగ్ రాదనే వాతావరణం నెలకొందని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. పంత్‌కు కీపింగ్ రానప్పుడు.. గత సీజన్‌లో వికెట్ల వెనుకాలా ఎలా రాణించాడని, సాహా సెంచరీ ఎలా చేశాడని చోప్రా ప్రశ్నించాడు. ఈ ఇద్దరు ప్రస్తుతం ఫామ్‌లో లేరని చెప్పాడు. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఘోర పరాజయం తర్వాత జట్టులో మార్పులు అనివార్యమైంది. ఓపెనర్‌ పృథ్వీ షా ఫేలవ ప్రదర్శన చేయడంతో అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌, పెటర్నిటీ లీవ్‌పై భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లి స్థానంలో కేఎల్ రాహుల్‌ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

అరుదైన దివ్యభారతీ ఫోటోలు.. ఈ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా?

దాంతో పాటు టీమిండియా జట్టులో కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ స్థానంపై ఆసక్తి నెలకొంది. తొలి టెస్టులో అటు కీపర్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమైన వృద్ధిమాన్‌ సాహాకు మరో స్థానం ఇస్తారా లేక రిషబ్‌ పంత్‌కు చోటు ఇస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కినా మంచిదేనని చోప్రా అభిప్రాయపడ్డాడు.

'తొలి టెస్టు తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై వెళ్లడంతో రాహుల్‌, గిల్‌లో ఒకరు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే భారత ఓపెనర్లు దూకుడుగా లేరు. కాబట్టి జట్టు బ్యాలెన్స్ కోసం పంత్‌ను తీసుకోవచ్చు. అలాకాకుండా సాహాను తీసుకున్నా వచ్చే సమస్యేం లేదు. ఏడో స్థానంలో మంచి కీపర్ కావాలనుకుంటే సాహాను ఎంచుకోవచ్చు. అంతేకానీ సాహా బ్యాటింగ్ చేయలేడు, పంత్ కీపింగ్ చేయలేడని వారిపై వేటు వేయడం సమంజసం కాదు.

దురదృష్టవశాత్తు పంత్‌కు కీపింగ్, సాహాకు బ్యాటింగ్ రాదనే వాతావరణం నెలకొంది. అలా అయితే గత పర్యటనలో పంత్ కీపర్‌గా ఎలా రాణించాడు. దాదాపు క్యాచ్‌లన్నీ ఎలా పట్టాడు. అదే విధంగా బ్యాటింగ్ రాదంటున్న సాహా.. టెస్ట్ సెంచరీ ఎలా సాధించాడు. బ్యాటింగ్ లైనప్‌లో లెఫ్టాండర్ ఉండాలని, గేమ్ చేంజర్ కావాలనే ఆలోచనతో పంత్‌ను తీసుకున్నా.. అలా కాకుండా సాహాను కొనసాగించినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సాహాను ఎందుకు ఆడించారని నేను ప్రశ్నించను. విమర్శించను.'అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. కోహ్లీ గైర్హాజరీలో జట్టును తాత్కలిక సారథిగా అజింక్యా రహానే నడిపించనుండగా.. డిసెంబర్ 26 నుంచి రెండో టెస్ట్ మొదలవ్వనుంది.

Story first published: Tuesday, December 22, 2020, 17:40 [IST]
Other articles published on Dec 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X