న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్ లిస్ట్: టాప్‌లో జడేజా.. చివరి స్థానంలో కోహ్లీ!!

Aakash Chopra picks Ravindra Jadeja as best Indian fielder of all time

ఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్ అని భారత మాజీ ఓపెనర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మూడు తరాల్లోని భారత అగ్రశ్రేణి ఫీల్డర్ల గురించి మాట్లాడిన చోప్రా.. టాప్-6 ఫీల్డర్లని ఎంపిక చేశాడు. ఇందులో రవీంద్ర జడేజా నెం.1 స్థానాన్ని దక్కించుకోగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు.

కోహ్లీ ఫీల్డర్‌గానూ మెరుగవుతున్నాడు

కోహ్లీ ఫీల్డర్‌గానూ మెరుగవుతున్నాడు

తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా మూడు తరాల్లోని భారత ఫీల్డర్లపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. అందులో రవీంద్ర జడేజా తొలి స్థానంలో నిలవగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక మిగతా క్రికెటర్లలో సురేశ్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్‌ కపిల్ ‌దేవ్‌ కూడా ఉన్నాడు. మొదటగా కోహ్లీ గురించి మాట్లాడిన చోప్రా... 'ఆటగాడిగా ఎలా ఎదుగుతున్నాడో ఫీల్డర్‌గానూ అలా మెరుగవుతున్నాడు. కోహ్లీ స్లిప్‌లో క్యాచ్‌లు వదిలేసినా మైదానంలో ఎక్కడైనా ఫీల్డింగ్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మంచి ఫీల్డర్‌గా ఎదుగుతున్నాడు' అని అభిప్రాయపడ్డాడు.

భారత ఫీల్డింగ్‌ స్వరూపాన్నే మార్చేశారు

భారత ఫీల్డింగ్‌ స్వరూపాన్నే మార్చేశారు

కపిల్‌ దేవ్‌ 1983 ప్రపంచకప్‌ ఫైనల్లో విండీస్‌ దిగ్గజం సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ క్యాచ్‌ను అద్భుతంగా పట్టుకున్నాడని ఆకాశ్ చోప్రా కొనియాడాడు. యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌లకు నాలుగు, మూడో స్థానం కేటాయించిన చోప్రా.. వీళ్లిద్దరూ భారత ఫీల్డింగ్‌ స్వరూపాన్నే మార్చేశారని గుర్తు చేసుకున్నాడు. యువీ త్రోలు కైఫ్‌ కన్నా అద్భుతంగా ఉంటాయని, బంతిని నేరుగా వికెట్లకు విసురుతాడని చెప్పాడు. వీరు మైదానంలో చురుగ్గా ఉంటారని, బంతి ఎటువైపు వెళ్తున్నా అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంటారని పేర్కొన్నాడు. కైఫ్‌ స్లిప్‌లోనూ క్యాచ్‌లు అందుకోగల సమర్థుడన్నాడు.

రైనాకు రెండో స్థానం

రైనాకు రెండో స్థానం

సురేశ్‌ రైనాకు రెండో స్థానం కేటాయించిన చోప్రా.. అతడు మైదానంలో ఎక్కడైనా ఫీల్డింగ్‌ చేయగలడని కితాబిచ్చాడు. కవర్స్‌లో, స్లిప్‌లో, బౌండరీ లైన్‌ వద్ద ఎక్కడైనా మంచి ఫీల్డింగ్‌ చేస్తాడన్నాడు. ఇక జడేజా గురించి స్పందించిన క్రికెట్ వ్యాఖ్యాత.. అతడిని సర్‌ రవీంద్ర జడేజా అని సంబోధించాడు. అతడికి రాకెట్‌లా వేగంగా స్పందించే చేతులున్నాయని, ప్రస్తుత క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌ అని మెచ్చుకున్నాడు. అతడి గ్రౌండ్‌ కవరేజ్‌ చాలా బాగుంటుందని, స్లిప్‌లో తప్పిస్తే ఎక్కడైనా చిరుతలా కదలాడుతాడని చెప్పాడు. దీంతో జడ్డూకే తొలి స్థానం ఇచ్చినట్లు ఆకాశ్‌చోప్రా స్పష్టం చేశాడు.

ఆకాశ్ చోప్రా బెస్ట్ ఫీల్డర్లు:

ఆకాశ్ చోప్రా బెస్ట్ ఫీల్డర్లు:

1. రవీంద్ర జడేజా

2. సురేశ్ రైనా

3. మహ్మద్ కైఫ్

4. యువరాజ్ సింగ్

5. కపిల్‌‌దేవ్

6. విరాట్ కోహ్లీ

తండ్రయిన టీమిండియా వెటరన్ క్రికెటర్!!

Story first published: Monday, July 13, 2020, 13:36 [IST]
Other articles published on Jul 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X